Shahid Kapoor: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డాన్స్ ఐకాన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అల్లు అర్జున్ (Allu Arjun), ఎన్టీఆర్(NTR ), రామ్ చరణ్ (Ram Charan) ప్రథమ స్థానంలో ఉంటారు. వీరు ముగ్గురు డాన్స్ చేశారు అంటే ఒక రిథమ్ కనిపిస్తుంది.అంతేకాదు శరీరాన్ని విల్లులా వంచుతూ.. తమ అద్భుతమైన డాన్స్ తో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరితో పోటీ పడడానికి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Sharukh Khan)కూడా వెనుకడుగు వేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సౌత్ హీరోలు చాలా ఫాస్ట్ గా డాన్స్ చేస్తారు. మీ స్పీడును అందుకోవడం మాకు కష్టంగా ఉంది. కాస్త మీరు కూడా తగ్గండి అంటూ సరదాగా కామెంట్లు చేశారు. దీంతో సౌత్ హీరోలతో డాన్స్ లో ఢీకొట్టే వారు ఇంకెవరూ లేరు అని అందరూ సంబరపడిపోయారు. కానీ ఇక్కడ ఒక బాలీవుడ్ హీరో మాత్రం టాలీవుడ్ హీరోలకు పోటీగా నిలుస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
డాన్స్ విషయంలో సౌత్ హీరోలకు పోటీగా షాహిద్ కపూర్..
ఆయన ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor). ఈయన వెండితెరపై భావోద్వేగాలు పండించడంలో యాక్షన్ సన్నివేశాలలో నటించడంలో షాహిద్ కపూర్ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ బెస్ట్ డాన్సర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న హృతిక్ రోషన్ (Hrithik Roshan), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) లకు ధీటుగా డాన్స్ చేసి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శియామక్ దావర్ వద్ద చిన్న వయసులోనే నృత్య సంస్థలో చేరారు. అక్కడ ఆయన జార్జ్ నుండి బ్యాలెట్, సమకాలీన నృత్యం వరకు వివిధ నృత్య శైలుల ప్రాథమికాలను నేర్చుకొని ఇప్పుడు బెస్ట్ డాన్సర్ గా గుర్తింపు దక్కించుకున్నారు.
బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా గుర్తింపు..
ఇకపోతే షాహిద్ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టకు ముందు, బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా పనిచేశారు.. ముఖ్యంగా ఆయన నైపుణ్యాలను రూపొందించడంలో కీలకపాత్ర పోషించింది. దిల్ తో పాగల్ హై, తాల్ వంటి చిత్రాలలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా పనిచేసిన ఈయన, ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి , హీరోగా భారీ స్టేటస్ అందుకున్నారు. ముఖ్యంగా తెలుగులో ఎన్టీఆర్ (NTR), అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్(Ram Charan) లాంటి వాళ్ళు బెస్ట్ డాన్సర్లుగా నిలిస్తే, ఇప్పుడు బాలీవుడ్లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ జాబితాలోకి షాహిద్ కపూర్ కూడా చేరిపోయి బెస్ట్ డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఏది ఏమైనా షాహిద్ కపూర్ తన నటనతోనే కాదు డాన్స్ పెర్ఫార్మెన్స్ తో కూడా అందరిని అబ్బురపరుస్తున్నారు అని చెప్పవచ్చు. షాహిద్ కపూర్ ఎవరో కాదు ప్రముఖ నటులు పంకజ్ కపూర్, నీలిమ అజీమ్ ల కుమారుడు. ఈయన 3వ ఏట తల్లిదండ్రులు విడిపోయారు. అప్పటి నుంచి తల్లి వద్దే పెరిగారు. ఇక ఈయనకు పది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తల్లితో సహా ముంబైకి షిఫ్ట్ అయ్యారు షాహిద్ కపూర్. ఇక ముంబైలోని నటన రంగంలోకి రావాలనుకున్న ఈయన విద్యాభ్యాసం పూర్తి చేసి , 1990లో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా కెరియర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత కొన్ని మ్యూజిక్ వీడియోలలో , టీవీ ప్రకటనలలో కూడా నటించారు షాహిద్ కపూర్. 2003లో ‘ఇష్క్ విష్క్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి అరంగేట్రం చేసి, ఉత్తమ నటుడు విభాగంలో ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.