Shahid Kapoor comments : సినిమా కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఏ భాషా చిత్రాన్ని అయినా ఆదరించే మనసు తెలుగు ప్రేక్షకులకు ఉంటుంది అని ఇప్పటికీ ఎంతోమంది సినీ ప్రముఖులు అన్నారు. అందుకే ఈమధ్య కాలంలో ఇతర భాషా హీరోలు సైతం నేరుగా తెలుగు రాష్ట్రాలకు వచ్చి తమ సినిమాలను ప్రమోట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. దీని కారణంగానే తాజాగా హీరో షాహిద్ కపూర్ చిక్కుల్లో పడ్డాడు.
కొన్నిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షాహిద్ కపూర్.. ‘సౌత్ ప్రేక్షకులు హిందీ సినిమాలను యాక్సెప్ట్ చేయరు’ అంటూ కామెంట్ చేశాడు. కొద్దికాలంలోనే ఈ కామెంట్ అంతటా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో దీనిపై నెగిటివిటీ ఎక్కువయ్యింది. తాజాగా సోషల్ మీడియాలో తనను ఏమైన అడగవచ్చని ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఒక వ్యక్తి.. సౌత్ ప్రేక్షకులపై మీరు చేసిన కామెంట్‌కు మీ స్పందన ఏంటి అని అడగగా.. షాహిద్.. సౌత్ ప్రేక్షకులు హిందీ సినిమాలను మరింత మనస్ఫూర్తిగా స్వీకరించాలి అన్నాడు.
ఫాహిద్.. ఒక్కసారి కాకుండా మరోసారి కూడా సౌత్ ప్రేక్షకులపై కామెంట్ చేయడం చాలామందికి నచ్చలేదు. ‘సౌత్ సినిమాలు అంటే నాకు కూడా ఇష్టమే. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో ఎన్నో సినిమాలు చూశాను. ఇండియన్ ఆర్ట్‌కు. ఆర్టిసులకు బౌండరీలు ఉండకూడదు’ అన్నాడు. దీనిని బట్టి చూస్తే సౌత్ ప్రేక్షకులు బౌండరీలు పెడుతున్నారని అన్నట్టుగా చాలామంది అర్థం చేసుకున్నారు. అందుకే ప్రస్తుతం షాహిద్‌పై సౌత్ ప్రేక్షకులు ఫైర్ మీద ఉన్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ని హిందీలో ‘కబీర్ సింగ్’గా షాహిద్ రీమేక్ చేసినప్పుడు సౌత్ ప్రేక్షకులు సైతం దీనిని ఆదరించిన విషయంలో మర్చిపోవద్దని ఘాటుగా స్పందిస్తున్నారు.