BigTV English

Shalini Ajith Kumar: హాస్పిటల్ లో అజిత్ భార్య.. అసలేమైంది.. ?

Shalini Ajith Kumar: హాస్పిటల్ లో అజిత్ భార్య.. అసలేమైంది.. ?

Shalini Ajith Kumar: కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ భార్య షాలిని అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా ఆమె ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. సఖి సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరయ్యింది. ఆ తరువాత హీరో అజిత్ ను ప్రేమించి పెళ్లాడిన షాలిని.. సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఇంటికే పరిమితమయ్యింది. అజిత్ – షాలినికి ఇద్దరు పిల్లలు.


ఇక ఈ మధ్యకాలంలో వీరిద్దరూ విడిపోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అయితే తాము విడిపోవడం లేదని ఎప్పటికప్పుడు ఈ జంట.. వారు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా షాలిని.. ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆమె పక్కనే అజిత్ కూడా ఉన్నాడు.

ఆసుపత్రి బెడ్ పై షాలిని ఉండగా.. ఆమెను పట్టుకొని అజిత్ కనిపించాడు. ఆ ఫోటోను షాలిని షేర్ చేస్తూ.. లవ్ యూ ఫర్ ఎవర్ అని రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. షాలినికి ఏమైంది అని అభిమానులు ఆందోళన పడుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం షాలినికి చిన్న సర్జరీ జరుగుతుందట. త్వరలోనే ఆమె కోలుకోనున్నదని టాక్. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.


ఇక అజిత్ కెరీర్ విషయానికొస్తే .. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి విదా ముయార్చి. రెండోది గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ సినిమాలతో అజిత్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×