BigTV English

Shanmukh Jaswant: నా జీవితంలో నాకు అర్దమైంది ఇదే.. షణ్ముఖ్ జశ్వంత్ వైరల్ పోస్ట్

Shanmukh Jaswant: నా జీవితంలో నాకు అర్దమైంది ఇదే.. షణ్ముఖ్ జశ్వంత్ వైరల్ పోస్ట్

Shanmukh Jaswant Emotional Post Goes Viral: సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన షణ్ముక్ జస్వంత్ షార్ట్ ఫిల్మ్స్‌తో యూట్యూబర్ గా సూపర్ క్రేజీ సంపాదించుకున్నాడు. యూట్యూబర్‌గా లక్షల మంది ఫాలోవర్స్ ను దక్కించుకున్న షన్నుకి మాత్రం బిగ్ బాస్ షో  తన ప్రొఫెషన్ ల్ తో పాటు పర్శనల్ లైఫ్ ను కూడా మార్చేసింది. ఈ షోలో సిరి హన్ముంత్ తో కలిసి చేసిన రచ్చ వల్ల అతనికి చెడ్డ పేరు వచ్చింది. దీంతో దీప్తి సునైనా షణ్ముఖ్‌ని వదిలేసి బ్రేకప్ చెప్పి దూరంగా వెళ్లిపోయింది. దీనికి తోడు ఈ మధ్యనే డ్రగ్స్ కేసులో ఇరుకున్నాడు.


ఈ పరిణామాలన్ని చూసి షన్ను మాత్రం డిప్రెషన్ ను నుంచి ఇంకా బయటపడనట్టే కనిపిస్తోంది. తాజాగా షన్ను పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోస్ట్ ని చూసిన ప్రతి ఒక్కరూ కదిలిపోవాల్సిందే.. సీఏ విద్యార్దుల కోసం ఓ వ్యక్తి పెట్టిన ఆ పోస్ట్‌ను షన్ను షేర్ చేశాడు. ఆ పోస్ట్ లో.. పిల్లలపై చదువులు, ఉద్యోగాలు అంటూ వారిపై ఒత్తిడి చేయకండి. వారితో స్నేహపూరితంగా మాట్లాడండి. వారికి ఇష్టమైన చదువునే చదివించండి. మీ పిల్లలతో మనస్ఫూర్తిగా మాట్లాడండి అంటూ రాసుకొచ్చారు.

అయితే ఈ పోస్ట్ పై షణ్ముఖ్ జశ్వంత్ స్పందించాడు. ఇది కేవలం విద్యార్దులకు మాత్రమే కాదు. ప్రతి ఒక్కరికి వర్తింస్తుందని తెలిపాడు. ఇక తన లైఫ్ లో జరిగిన పరిణామాలను తెలియజేశాడు. తనకి కూడా ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించందని తెలిపాడు. కానీ మనం ఇలా సూసైడ్ చేసుకొని చనిపోతే లోకంలో మనగురించి ఎవ్వరూ పట్టించుకోరు. మన తల్లదండ్రులు తప్ప మనకోసం పట్టించుకునేవాళ్లు ఎవరూ లేరని అన్నాడు.


Also Read: అన్నంత పని చేసిన మా ప్రెసిడెంట్.. 5 యూట్యూబ్ ఛానెల్స్ తొలగింపు

మన లైఫ్ లో ఎన్నో సమస్యలు, కష్టాలు, సంతోషాలు వస్తాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. ఆ దేవుడు మనకి ఎన్నో పరీక్షలు పెడుతూనే ఉంటాడు. వాటిని ఎదుర్కొని నిలబడాలి అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు. నా లైఫ్ లో నేను నేర్చుకొన్న జీవిత పాఠం ఒకటి ఉందని.. చెప్పాడు. నేను చాలా స్ట్రాంగ్.. ఏదైనా నేను సాధించగలను.. ఏ కష్టం వచ్చిన నిలబడతాను అన్న మంత్రాన్ని జపించాలని పేర్కొన్నాడు. ఇక మానసిక సమస్య అనేది కొద్ది రోజులోనో.. ఒక నెలలోనో.. ఒక సంవత్సరంలోనో తీరుపోయే సమస్య కాదు అని చెప్పాడు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×