BigTV English

Manchu Vishnu: అన్నంత పని చేసిన మా ప్రెసిడెంట్.. 5 యూట్యూబ్ ఛానెల్స్ తొలగింపు

Manchu Vishnu: అన్నంత పని చేసిన మా ప్రెసిడెంట్.. 5 యూట్యూబ్ ఛానెల్స్ తొలగింపు

Manchu Vishnu: మా ప్రెసిడెంట్ మంచు విష్ణు అన్నంత పని చేశాడు. యూట్యూబ్ లో సెలబ్రిటీల ఫొటోలతో అసభ్యకరమైన మీమ్స్ వేస్తున్న యూట్యూబర్స్ కు పెద్ద ఝలక్ ఇచ్చాడు. రెండురోజుల్లో కనుక అలాంటి అసభ్యకరమైన మీమ్స్ ను కనుక డిలీట్ చేయకపోతే లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని, యూట్యూబ్ ను కూడా తొలగించాల్సి వస్తుందని యూట్యూబర్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.


కానీ, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ విష్ణు మాటలు లెక్కచేయకుండా ఆలాగే ఉంచడంతో.. విష్ణు టీమ్ 5 యూట్యూబ్ ఛానెల్స్ ను తొలగించింది. ఈ విషయాన్నీ మా అధికారికంగా వెల్లడించింది. “అణచివేత మొదలైంది. నటీనటులు, వారి కుటుంబాలు మరియు వ్యక్తిగత దాడుల గురించి అవమానకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేసినందుకు ఐదు యూట్యూబ్ ఛానెల్‌లు రద్దు చేయబడ్డాయి. ఇది ప్రారంభం మాత్రమే. మేము తదుపరి చర్య తీసుకున్నందున మేము జాబితాను నవీకరించడాన్ని కొనసాగిస్తాము” అంటూ ఆ 5 యూట్యూబ్ ఛానెల్స్ నేమ్స్ ను కూడా ప్రకటించారు.

అవేంటంటే.. జస్ట్ వాచ్ బిబిసి, ట్రోల్స్ రాజా, బాచిన లలిత్, హైదరాబాద్ కుర్రాడు, Xyz ఎడిట్స్007. ఈ ఐదు యూట్యూబ్ ఛానెల్స్ ను రద్దు చేసినట్లు తెలిపారు. ఇలాగే అసభ్యకరమైన కంటెంట్ ఉన్న ప్రతి యూట్యూబ్ ను రద్దు చేస్తామని, మిగిలినవారు జాగ్రత్తపడి తమంతట తామే ఆ మీమ్స్ ను డిలీట్ చేస్తే.. కనీసం యూట్యూబ్ అయినా ఉంటుందని మరోసారి వార్నింగ్ ఇచ్చారు.


ఇక యూట్యూబర్ ప్రణీత్ హన్మంతు వివాదం తరువాత ఇలాంటివి ముందు ముందు జరగకుండా మా సంఘం ఇచ్చిన ఫిర్యాదులను దృష్టిలోకి తీసుకొని తాను ఈ పని చేస్తున్నట్లు మంచి విష్ణు తెలిపాడు. మరి ముందు ముందు ఏ యూట్యూబ్ ఛానెల్స్ ను తొలగిస్తారో చూడాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×