E-Paper
Advertisement

Shanmukh Jaswanth: నీ కథ ముగిసిపోలేదు.. ఏడ్చిన చోటే.. దీప్తి కోసమేనా షన్నూ ఆ పోస్ట్?

Shanmukh Jaswanth: నీ కథ ముగిసిపోలేదు.. ఏడ్చిన చోటే.. దీప్తి కోసమేనా షన్నూ ఆ పోస్ట్?
Advertisement

Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.. వెబ్ సిరీస్ తో యూట్యూబ్లో క్రేజ్ సంపాదించుకున్నాడు షన్ను. యూట్యూబ్ స్టార్ గా, నటుడిగా, డాన్సర్ గా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. బిగ్బాస్ తెలుగు సీజన్ 5 లో రన్నర్ అప్ గా నిలిచారు. దీప్తి సునైనా తో ప్రేమ వ్యవహారంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. షణ్ముఖ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తాజా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ దీప్తిని ఉద్దేశించే అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అసలు ఆ పోస్ట్ ఏంటో చూద్దాం..

కథ ఇక్కడితో ముగిసి పోలేదు ..

Advertisement

షణ్ముఖ్ వైవా అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా యూట్యూబ్ లో క్రేజ్ సంపాదించాడు. అక్కడినుండి వరుసగా వెబ్ సిరీస్, డాన్స్ వీడియోలతో అభిమానులకు దగ్గరయ్యాడు. దీప్తి సునైనాతో చేసిన కవర్ సాంగ్స్, ఎంతో పేరు తెచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ అప్పట్లో సెన్సేషన్. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల షణ్ముఖతో బ్రేకప్ చెబుతూ దీప్తి లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇద్దరు విడిపోయారు అన్న వార్త అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ఎవరి జీవితాలు వారు గడుపుతున్నారు. కానీ ఇప్పటికీ షణ్ముఖ్, దీప్తి ఇద్దరిపై ఎటువంటి వార్త వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా షణ్ముఖ్ చేసిన పోస్టును దీప్తిని ఉద్దేశించి చేశాడంటూ నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. షణ్ముఖ్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ‘నీ కథ ముగిసిపోలేదు.. నువ్వు ఏడ్చిన చోటే నవ్వుతావు’ అని విష్ణుమూర్తి ఫోటోతో ఈ క్యాప్షన్ ని జోడించి తన స్టేటస్ ను పోస్ట్ చేశారు. ఈ స్టేటస్ చూసిన వారంతా ఈ పోస్టు షన్ను, దీప్తిని ఉద్దేశించే చేశాడని.. ఆమె లేకపోవడంతో కథ ఇక్కడితో ముగిసి పోలేదని, నువ్వు బాధపడిన వ్యక్తి ఎదుటే తిరిగి నవ్వుతావు అని అర్థం వచ్చేట్లు పోస్ట్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. షణ్ముఖ్ నువ్వు మళ్ళీ కెరీర్ పై ఫోకస్ పెట్టాలని, సెటిల్ అవ్వాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

యూట్యూబ్ స్టార్ ..

Advertisement

షణ్ముఖ్ సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్ తో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ను యూట్యూబ్ వేదికగా సొంతం చేసుకున్నాడు. షణ్ముఖ్ ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. గత సంవత్సరం లీలా వినోదం వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ని అందుకున్నారు. షణ్ముఖ్ కెరియర్ లో ఎన్నో వివాదాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. దీప్తి సునయనతో నటించిన ఓ షార్ట్ ఫిలిం హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అప్పట్లో పెద్ద ఆరోపణలే వచ్చాయి. దానిపై షణ్ముఖ్ తర్వాత వివరణ ఇవ్వడం జరిగింది. 2021లో డ్రంక్ అండ్ డ్రగ్ కేసులోనూ అరెస్ట్ అయ్యాడు. వీటన్నిటినీ అధిగమించి మళ్లీ తన కెరియర్ పై ఫోకస్ పెట్టి వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. షణ్ముఖ్, దీప్తి సునైనా ప్రేమ బంధం అందరికీ తెలిసిందే, బిగ్బాస్ సీజన్ 5 కు షణ్ముఖ్ వెళ్లిన తర్వాత వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరు విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటికీ యూట్యూబ్ కపుల్స్ అంటే షణ్ముఖ్ జస్వంత్ దీప్తి అని అంటారు.

Rashmi Gautam: ఆపరేషన్ వల్ల అన్నీ క్యాన్సిల్ అయ్యాయి… రష్మి ఇన్‌స్టా పోస్ట్ వైరల్

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×