Rashmi Gautam: బుల్లితెర అభిమానులకు యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. 2022లో హోలీ అనే మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రష్మీ. ఇకపోతే జబర్దస్త్ షో ద్వారా ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. సుడిగాలి సుధీర్ తో ఆమె చేసిన ప్రతి షో టీఆర్పీ రేటింగ్ టాప్ లో దూసుకుపోయేది. వారిద్దరి జోడికి, ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారని చెప్పొచ్చు. సుధీర్ రేష్మి అంటే చాలు, షో ఏదైనా ఛానల్ ఏదైనా హిట్ అయి తీరుతుంది. అంత క్రేజ్ ఉన్న రష్మీ ఇటీవల ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టింది. ఆమె సర్జరీకి సిద్ధమవుతున్నట్లుగా ఈ పోస్టులో తెలిపింది. తాజాగా ఆమె మరో పోస్ట్ తో ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. ఆ పోస్ట్ లో ఏముందో ఇప్పుడు చూద్దాం..
ఆపరేషన్ వల్ల అన్నీ క్యాన్సిల్ అయ్యాయి..
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, అంటేనే రేష్మి అనే విధంగా మారిపోయింది. కంటెస్టెంట్స్ కొంతమంది షో నుండి బయటకు వెళ్తున్నారు.. మళ్ళీ వస్తున్నారు కానీ, రెష్మీ మాత్రం ఎప్పటినుంచో యాంకర్ గా ఆ షోలో స్థిరపడిపోయారు. ఇటీవల ఆమెకు భుజంకి ఆపరేషన్ చేస్తున్నారని తెలిపింది. ఇక తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఆపరేషన్ కంప్లీట్ అయినట్లు హాస్పిటల్ నుండి ఆమె డిశ్చార్జ్ ఇంటికి వెళ్తున్న వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆమె వీల్ చైర్లో కూర్చుని, హాస్పిటల్ రూమ్ లో నుండి బయటకు వస్తున్నట్లు చూపించారు. వీల్ చైర్ పైనే ఫాన్స్ కి అభివాదం చేస్తూ రేష్మి వీడియో చేసింది. ఇక ఆమె ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిపింది. మా అమ్మ పుట్టినరోజు 24 వ తారీకు బర్త్డే ప్లాన్ రెండు నెలల ముందు నుంచే చేశాను. కానీ అనుకోకుండా అత్యవసరమైన ఆపరేషన్ అవడంతో చేయించుకోక తప్పలేదు. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈత కొట్టకూడదు, డ్రైవింగ్ చేయకూడదు, రైట్ చేయకూడదు, స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళకూడదు. డాన్స్ చేయకూడదు. జంపింగ్ చేయకూడదు. ఈ ఆపరేషన్ వల్ల అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. ఎంతో ప్లాన్ చేసుకున్న బర్త్డే, ఫ్రెండ్ మ్యారేజ్ అన్ని క్యాన్సిల్ అయ్యాయని, చివరికి ఫ్లైట్ కూడా ఎక్కకూడదు అని ఇన్స్టాల్ లో పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలని, మళ్లీ స్టేజ్ పై రెష్మీ అల్లరితో షో చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
ఆ షో తో పాపులర్ ..
బుల్లితెరపై కాక వెండితెరపై కూడ తన ప్రతిభను చూపించారు రేష్మి. ఆమె నటించిన సినిమాలలో కరెంటు, బిందాసు, గుంటూరు టాకీస్, బొమ్మ బ్లాక్ బాస్టర్ సినిమాలు ఆమె నటిగా గుర్తింపు తెచ్చాయి. యువ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా రష్మీ యాంకరింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత లవ్ ఐడియా, సూపర్ అనే షోలతో మెప్పించింది. ఇక జబర్దస్త్ కి అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్ కి రేష్మి యాంకర్లుగా ఉండేవారు. కొంతకాలం తర్వాత అనసూయ సినిమాల్లో బిజీ అవడం వల్ల, పూర్తిగా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది. దాంతో రేష్మి ఫుల్ బిజీ అయిపోయింది. రెండు షోలలో యాంకరింగ్ చేస్తూ, శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా చేస్తుంది. అలాగే ఈటీవీలో పండగలప్పుడు స్పెషల్ ఈవెంట్స్ లోనూ రేష్మి యాంకరింగ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆమె త్వరగా కోలుకొని మళ్ళీ షోలలో గతంలో లాగా యాంకరింగ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు.
?igsh=ZjFkYzMzMDQzZg==