APMSRB Jobs: ఏపీ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఏపీఎమ్ఎస్ఆర్‌బీ) లో పలు ఉద్యోగాల భర్తీ చేేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి రూ.లక్షల్లో జీతాలు ఉంటాయి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APMSRB) ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. అర్హులైన వారు ఈ నెల 16వ తేదీన ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 128
ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్ : 128 ఉద్యోగాలు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డీఎన్‌బీ లేదా డీఎం లేదా ఎంసీహెచ్ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 42 నుంచి 52 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
జీతం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నెలకు రూ.68,900 నుంచి రూ.2,05,500 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.1000 ఫీజు ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఇంటర్వ్యూ తేది: 2025 మే 16
ఇంటర్వ్యూ ప్లేస్: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఓల్డ్ జీజీహెచ్ క్యాంపస్, హనుమాన్ పేట, విజయవాడ
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://dme.ap.nic.in/
అర్హత ఉండి ఆసక్తి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.68,900 నుంచి రూ.2,05,500 వరకు జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: ALP Recruitment: రైల్వేలో 9970 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువుకు దగ్గర పడుతుంది మిత్రమా..?
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 128
ఇంటర్వ్యూ తేది: 2025 మే 16
Also Read: AAI Recruitment: డిగ్రీతో ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.1,40,000 జీతం