BigTV English

MegaAnil : చిరంజీవికి చెల్లెలుగా నటించిన ఆమెని ఇప్పుడు హీరోయిన్ గా పెడతారా.? 

MegaAnil : చిరంజీవికి చెల్లెలుగా నటించిన ఆమెని ఇప్పుడు హీరోయిన్ గా పెడతారా.? 

MegaAnil : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గత నాలుగు దశాబ్దాలుగా ఉన్న ఏకైక స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటుడుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి నేడు మెగాస్టార్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. వరుస హిట్ సినిమాలు చేస్తూ కెరియర్ తారస్థాయిలో ఉన్న తరుణంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాజకీయాల్లో కూడా ఒక రకమైన సక్సెస్ పొందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కానీ కొన్ని పరిస్థితుల వలన ఆయన రాజకీయాల్లో నిలబడలేకపోయారు. కొంతకాలం పాటు సినిమాలు కు దూరంగా ఉండిపోయారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలి అని చాలామంది ఎదురు చూశారు. మొత్తానికి ఖైదీ నెంబర్ 150 అనే సినిమాతో మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించి మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.


రీ ఎంట్రీ తర్వాత జోరు 

ఒకప్పుడు సంవత్సరానికి రెండు మూడు సినిమాలు కూడా స్టార్ హీరోలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ హీరోలు అంతా కూడా ఒక సినిమాకే పరిమితమై ఉండిపోతున్నారు. ముఖ్యంగా రెండేళ్లకు ఒక సినిమా రావడం మొదలైంది. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలకు సైన్ చేసి ఫినిష్ చేశారు. మెగాస్టార్ ని చూసి చాలామంది నేర్చుకోవాలి అని అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఇక మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాలలో వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఏవైతే మెగాస్టార్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో వాటన్నిటిని అద్భుతంగా ఆ సినిమాలో పొందుపరిచాడు బాబి.


చెల్లెలే హీరోయినా.?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ ఎప్పుడూ కొంచెం విచిత్రంగానే అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో చెల్లెలుగా చేసిన వాళ్లే హీరోయిన్ గా కూడా చేస్తారు. అలానే మెగాస్టార్ తో హీరోయిన్ గా నటించిన కాజల్. పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ తో కూడా హీరోయిన్ సినిమాలు చేసింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ అనే సినిమాలో నయనతార మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా నటించింది. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో ఆవిడను ఒక పాత్ర కోసం సంప్రదించనున్నారు. ఒకవేళ అది హీరోయిన్ పాత్ర అయితే, అప్పుడు చెల్లెలుగా నటించిన ఆవిడ ఇప్పుడు హీరోహిన్ గా నటిస్తుందా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి పరిణామాలు ఫిలిం ఇండస్ట్రీలో ఇదివరకే చాలా జరిగాయి. ఇక మెగాస్టార్ చిరంజీవికి అక్కగా నటించిన కుష్బూ మెగాస్టార్ భర్తగా ఒక అడ్వర్టైజ్మెంట్లో కూడా నటించారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×