BigTV English

Sharwa #37 Movie Update: హిట్ కొట్టే వరకు తగ్గేదే లే.. శర్వా మరో కొత్త సినిమా అప్డేట్

Sharwa #37 Movie Update: హిట్ కొట్టే వరకు తగ్గేదే లే.. శర్వా మరో కొత్త సినిమా అప్డేట్

Update on Sharwa #37 Movie: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన కొత్త సినిమా ‘మనమే’ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో శర్వానంద్ యాక్టింగ్ చాలా బాగుందని అంటున్నారు. అయితే అక్కడక్కడ కాస్త బోరింగ్‌గా ఉందని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా.. ఇప్పుడు పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.


ఇక ఈ మూవీ శర్వా కెరీర్‌లో 35వ సినిమాగా తెరకెక్కింది. ఇదిలా ఉంటే ఇప్పుడు శర్వా నటించబోతున్న మరోక సినిమా గురించి అదిరే అప్డేట్‌ను మేకర్స్ అందించారు. శర్వా కెరీర్‌లో 37వ సినిమాగా ఓ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ చిత్రానికి ‘సామజవరగమన’ ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ మూవీ అత్యంత గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరలో అవుతోంది. దర్శకుడు రామ్ అబ్బరాజు సోషల్ మీడియా ద్వారా ఓ అప్డేట్ అందించాడు. ‘ప్రేమ.. నవ్వు కలయికను ఇంతకముందెన్నడూ లేని విధంగా సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి.. అద్భుతమైన ఫన్ రైడ్’ అంటూ ఈ మూవీ షూటింగ్ స్టిల్స్‌ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ స్టిల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ స్టిల్స్ చూసి శర్వా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.


Also Read: మాస్ అండ్ స్టైలిష్ లుక్‌లో శర్వానంద్.. బర్త్ డే రోజున ఇన్ని సినిమాలా..?

కాగా ఈ మూవీ షూటింగ్ నిన్న అంటే జూన్ 6న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శర్వానంద్, సంయుక్త ఇద్దరూ కీలక సన్నివేశాల షూటింగ్‌లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీతో పాటు ‘శర్వా 36’ మూవీ కూడా గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అందాల ముద్దుగుమ్మ మాళవికా నాయర్ ఈ మూవీలో శర్వాకు జోడీగా హీరోయిన్ పాత్రలో నటిస్తుంది. ఆ మధ్య ఈ మూవీ స్టిల్స్ కూడా రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఏది ఏమైనా శర్వానంద్ ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం.. విజయపజయాలతో సంబంధం లేకుండా పలు సినిమాతో దూసుకుపోతున్నాడనే చెప్పాలి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×