BigTV English

UN General Assembly: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో 5 దేశాలు ఎంపిక.. పాకిస్తాన్‌కు చోటు..?

UN General Assembly: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో 5 దేశాలు ఎంపిక.. పాకిస్తాన్‌కు చోటు..?

UN General Assembly: ఐక్యరాజ్యసమితిలోని ప్రధానమైన భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశంగా పాకిస్తాన్ ఎన్నికైంది. పాకిస్తాన్‌తోపాటు డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా దేశాలు ఈ మండలికి ఎన్నికయ్యాయి. తాజాగా, భద్రతా మండలిలో రెండేళ్ల సభ్యత్వం కోసం జరిగిన రహస్య బ్యాలెట్‌లో భద్రతా మండలికి శాశ్వతేతర సభ్య దేశాల కోటాలో ఈ ఐదు దేశాలు ఎన్నికయ్యాయి. అయితే ఈ సభ్యత్వం రెండేళ్ల వరకు జనవరి 1, 2025న ప్రారంభమై డిసెంబర్ 31, 2026 వరకు కొనసాగనుంది.


పాకిస్తాన్‌కు 182 ఓట్లు..

193 సభ్య దేశాలు గల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ.. ఈ ఐదు దేశాలను ఎంపిక చేసింది. రెండేళ్ల కాలానికి భద్రతా మండలిలో మొత్తం 15 సీట్లు ఉంటాయి. ఇందులో ఐదు వీటో అధికారం ఉన్న శాశ్వత సభ్య దేశాలు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉంటాయి. ఇంకా మిగతా 10 దేశాలను రెండేళ్ల పాటు తాత్కాలికి సభ్యులుగా ఎన్నుకుంటారు. అయితే ఈ సీట్లను ప్రాంతాలవారీగా కేయించనున్నారు. కాగా, యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఐదుగురు సభ్యులు రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటారు. ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్ దేశాల తరఫున రెండు స్థానాల్లో సోమాలియా, పాకిస్తాన్ దేశాలను ప్రతిపాదించాయి. సోమాలియాకు 179 ఓట్లు.. పాకిస్తాన్‌కు 182 ఓట్లు వచ్చాయి.


Also Read: ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం.. చరిత్ర, ప్రాముఖ్యత మీకు తెలుసా!

అత్యధికంగా డెన్మార్క్‌..

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ రహస్య బ్యాలెట్ ఎన్నికల్లో లాటిన్ అమెరికా, కరేబియన్ గ్రూపు పనామా పేరును ప్రతిపాదించగా.. డెన్మార్క్, గ్రీస్‌లు ఐరోపా తరఫున నామినేట్ అయ్యాయి. పనామాకు 183 ఓట్లు రాగా, డెన్మార్క్‌కు 184, గ్రీస్‌కు 182 ఓట్లు వచ్చాయి.ఈ సభ్య దేశాల పదవీకాలం వచ్చే ఏడాది జవనరి 1 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న తాత్కాలిక సభ్యదేశాలు జపాన్, మొజాంబిక్, ఈక్వెడార్, మాల్టా, స్విట్జర్లాండ్‌ల పదవీకాలం 2024 డిసెంబర్ 31న ముగియనుంది. అయితే ఈ భద్రతా మండలిని విస్తరించాలని అన్ని సభ్యదేశాలు కోరుతున్నప్పటికీ ఐక్యరాజ్యసమితి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×