BigTV English
Advertisement

Sharwanand 37th Movie: మాస్ అండ్ స్టైలిష్ లుక్‌లో శర్వానంద్.. బర్త్ డే రోజున ఇన్ని సినిమాలా..?

Sharwanand 37th Movie: మాస్ అండ్ స్టైలిష్ లుక్‌లో శర్వానంద్.. బర్త్ డే రోజున ఇన్ని సినిమాలా..?


Sharwa @ 37th Movie: హీరో శర్వానంద్ ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే వరుస పెట్టి సినిమాలను లైన్‌లో ఉంచాడు. నిన్న శర్వా బర్త్ డే సందర్భంగా పలు సినిమాలను అనౌన్స్ చేశారు. అందులో ‘మనమే’ మూవీ ఒకటి. ఈ మూవీ శర్వానంద్ కెరార్‌లో 35వ సినిమాగా తెరకెక్కుతోంది.

ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ మూవీలో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక నిన్న శర్వా బర్త్ డే కావడంతో ఈ మూవీ టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా ఈ మూవీ ఓ నాలుగేళ్ల బాలుడి చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.


కాగా ఈ మూవీలో మరో ప్రత్యేకం ఏంటంటే దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కొడుకు విక్రమ్ ఆదిత్య ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ హేషమ్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత శర్వానంద్ తన కెరీర్‌లో 36వ చిత్రాన్ని కూడా నిన్న అనౌన్స్ చేశాడు.

READ MORE: శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ వెబ్ సిరీస్ ‘లూజర్’ ఫేం దర్శకుడు అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ సమర్పణలో ప్రమోద్, వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీలో శర్వాకు జోడీగా మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతున్నట్లు నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. ఇందులో హీరో బైక్ రైడర్‌గా కనిపించబోతున్నాడు. ఈ మూవీ నిన్న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఇక ఈ మూవీతో పాటు శర్వానంద్ మరో సినిమాను తన లైనప్‌లో ఉంచాడు. తన కెరీర్‌లో 37వ సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీ అప్డేట్‌ను కూడా నిన్న తన పుట్టిన రోజున వెల్లడించాడు. ‘సామజవరగమన’ మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు ‘శర్వా37’ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సంయుక్తంగా అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ మేరకు నిన్న శర్వా బర్త్ డే కావడంతో ఈ మూవీ పోస్టర్‌ను విడుదల చేశారు.

READ MORE: మూడు తరాల కుటుంబాల క‌థ‌తో శ‌ర్వానంద్ కొత్త చిత్రం

ఈ పోస్టర్‌లో శర్వానంద్ పొడవాటి జుట్టు, గడ్డంతో రగ్గడ్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. పోస్టర్ బట్టి దర్శకుడు రామ్ అబ్బరాజు, శర్వానంద్‌ను హ్యుమరస్ క్యారెక్టర్‌లో చూపించబోతున్నాడని అర్ధమవుతోంది.

ఇక ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జ్ఞానశేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్స్‌తో సహా మరికొంత మంది నటీ నటుల గురించి ఎలాంటి సమాచారాన్ని మేకర్స్ వెల్లడించలేదు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×