BigTV English

Chandrababu on NDA Majority: చంద్రబాబు స్పీచ్.. ఎన్డీయే మెజార్టీ అద్భుతం, కాకపోతే..!

Chandrababu on NDA Majority: చంద్రబాబు స్పీచ్.. ఎన్డీయే మెజార్టీ అద్భుతం, కాకపోతే..!

Chandrababu Says NDA Won with Wonderful Majority: అద్బుతమైన మెజార్టీ సాధించిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. మూడునెలలు రేయింబవళ్లు మోదీ కష్టపడ్డారని అన్నారు. అందుకు తగ్గ ఫలితం దక్కిందన్నారు. మోదీ నాయకత్వంలో ప్రపంచ శక్తిగా భారత్ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు కనిపిస్తారన్నారు. భారతీయులు గ్లోబల్ లీడర్లు కాబోతున్నారని వివరించారు.


దూరదృష్టి కలిగిన నేతయిన మోదీ, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారన్నారు చంద్రబాబు. ఏపీలో మూడు బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. 2047 నాటికి భారత్ నెంబర్ వన్‌గా నిలుస్తోందని మనసులోని మాట బయటపెట్టారు. మోదీ లాంటి పవర్ ఫుల్ నేతల ఎక్కడా చూడలేదన్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ పెద్దలు ఎన్డీయేలోని పార్టీల నేతలు, ఎంపీలు హాజరయ్యారు.

తామంతా మీ వెంటే ఉన్నామన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తిగా నిలిచారని వివరించారు. మోదీ ప్రధానిగా ఉన్నంతవరకు భారత్ ఏ దేశానికీ తలొగ్గదన్నారు. మీ నేతృత్వంలో పని చేసేందుకు గర్వంగా భావిస్తున్నాని తెలిపారు.


Also Read: ఢిల్లీ కీలక సమావేశాలు.. పార్లమెంట్‌ వద్ద ఉద్రిక్తత..అసలు ఏమైందంటే?

అంతకుముందు ఎన్డీయే పక్షనేతగా నరేంద్రమోదీ పేరును రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. రాజ్‌నా‌థ్ ప్రతిపాదనను అమిత్ షా, గడ్కరీ, చంద్రబాబు, కుమారస్వామి బలపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్‌నాథ్, 1962 తర్వాత వరుసగా మూడోసారి ఎవరూ ప్రధాని కాలేదన్నారు. నరేంద్రమోదీ దూరదృష్టిని ప్రజలు ప్రత్యక్షంగా చూశారన్నారు. పదేళ్లపాటు ఎన్డీయే ప్రభుత్వం దేశానికి సేవలు అందించిందన్నారు. అంతేకాదు ప్రపంచ దేశాల నేతలు సైతం మోదీని ప్రశంసిస్తున్నారని గుర్తు చేశారు.

Chandrababu with party mps in delhi
Chandrababu with party mps in delhi

ఎన్డీయే పార్లమెంటరీ సమావేశానికి ముందు ఎంపీ రామ్మోహన్‌నాయుడు నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు 16 మంది పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఏపీకి నిధులు తీసుకొచ్చే విషయమై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే మోదీ మంత్రివర్గంలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే విషయాన్ని కూడా వెల్లడించారు.

Tags

Related News

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Big Stories

×