Shilpa Shetty.. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి (Shilpa Shetty)కి తాజాగా రెస్టారెంట్లో చేదు అనుభవం ఎదురయింది. ముంబైలోని దాదర్ వెస్ట్ లో కోహినూర్ స్క్వేర్ 48వ అంతస్తులో ఉన్న ఆమె రెస్టారెంట్ కి వచ్చిన ఒక కస్టమర్ బీఎండబ్ల్యూ కారునే ఎవరు దొంగతనం చేయడం ఆమెకు ఊహించని షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఆదివారం అక్టోబర్ 27న ఈ సంఘటన చోటుచేసుకుంది. సుమారు రూ.80 లక్షల విలువైన 2 సీటర్ కార్ ను బిల్డింగ్ పార్కింగ్ ఏరియా నుంచి ఎత్తుకెళ్లినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
శిల్పా శెట్టి రెస్టారెంట్లో రూ.80 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కార్ చోరీ..
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి చెందిన రెస్టారెంట్ కి ఆదివారం 34 ఏళ్ల యంగ్ వ్యాపారవేత్త రుహన్ ఫిరోజ్ ఖాన్ వచ్చాడు. ఆయన మరో ఇద్దరితో కలిసి అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత తన బీఎండబ్ల్యూ Z4 కార్ ను రెస్టారెంట్ వాలెట్ పార్కింగ్ ఉద్యోగికి అప్పగించి, ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్లోకి వెళ్లిపోయారు. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఆ కారు కాస్త కనిపించకుండా పోయింది. ఇక వెంటనే షాక్ అయిన కస్టమర్ సిసిటీవీ కెమెరాలను పరిశీలించగా ఆ కారును అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లు నిర్ధారణ అయింది. ఇకపోతే ఈ కారు విలువ అక్షరాల రూ.80 లక్షలు కావడం విశేషం. ఇకపోతే ఈ విషయం తెలిసిన వెంటనే రుహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దొంగతనం కేస్ ఫైల్..
శివాజీ పార్క్ పోలీసులు భారత న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 303(2) దొంగతనం కేసు కింద కేసు నమోదు చేశారు. దగ్గరలో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించి దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్లు రుహాన్ న్యాయవాది మీడియాతో తెలిపారు.
ముంబై అందాలను చూసేలా..
శిల్పా శెట్టి ముంబైలోని దాదర్ వెస్ట్ లో ఉన్న కోహినూర్ స్క్వేర్ 48వ అంతస్తులో ఈ రెస్టారెంట్ ను ఏర్పాటు చేయగా.. ముంబై సిటీ అందాలను చూస్తూ రెస్టారెంట్ రుచులను ఆస్వాదించే అవకాశం మనకు ఇందులో కల్పించబడింది. ఈ నేపథ్యంలోనే ఈ రెస్టారెంట్ కి ప్రముఖ బాలీవుడ్ నటులు, వ్యాపారవేత్తలు వస్తారు. ఈ క్రమంలోనే ఎవరో కావాలని కాపు గాసి మరీ రెస్టారెంట్ నుంచి లగ్జరీ కార్ ను దొంగతనం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
శిల్పాశెట్టికి ఇబ్బందేనా..
ఇకపోతే ఈ విషయం శిల్పా శెట్టి కి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న ఆమె ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఆమె కూడా కారు దొరికే వరకు కాస్త పోలీసులకు టచ్ లో ఉంటే బెటర్ అని అభిమానులు కోరుతున్నారు. లేకపోతే నెగటివ్ ఇమేజ్ పడిందంటే మళ్ళీ రెస్టారెంట్ కి ఎవరూ రారని , సెక్యూరిటీ లేని రెస్టారెంట్లకు వెళ్లడం అవివేకం అవుతుందని కూడా ఆలోచించే అవకాశం ఉందని సలహాలు ఇస్తున్నారు. మరి దీనిపై శిల్పా శెట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.