BigTV English

Street Food: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా? ప్రాణాలు పోతాయ్.. హెచ్చరిస్తున్న డాక్టర్స్

Street Food: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా? ప్రాణాలు పోతాయ్.. హెచ్చరిస్తున్న డాక్టర్స్

Street Food: నేటి రోజులో ఎక్కడపడితే అక్కడ, ఏదిపడితే అది.. లాగించేస్తున్నాం.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఇష్టమైన స్నాక్స్ ను ఆరగించేస్తున్నాం.. అయితే.. స్ట్రీట్ ఫుడ్స్ తినడం వల్ల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. హైదరాబాద్ లో ఓ మహిళ తనకు ఇష్టమైన మోమోస్ తిని ప్రాణం పోగొట్టుకుంది. అంతకు ముందు షవర్మా తిని చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మనం ఇష్టంగా భావించే మూడు డేంజరస్ స్ట్రీట్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


షవర్మా
ఇది మిడిల్ ఈస్ట్ కు సంబంధించిన ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. అయితే.. షవర్మాకు వినియోగించే మాంసాన్ని శీతలీకరించకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు.. కొన్నిసార్లు ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. షవర్మాలో సాల్మొనెల్లా, స్టెఫిలోకాకస్ ఆరియస్, ఇ.కోలి అనే బ్యాక్టిరియాలు ఉంటాయి. షవర్మాని సరిగ్గా వండకపోవడం, లేదా నిల్వ చేసిన మాంసంలో ఇవి వృద్ధి చెందుతాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు, పొత్తి కడుపు నొప్పి వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. సరైన చికిత్స తీసుకోకపోతే.. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా కావొచ్చు.

మోమోస్
మోమోస్.. దక్షిణాసియాలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. అయితే.. అపరిశుభ్రమైన వాతావరణంలో వీటిని తయారు చేయడం, నిల్వ ఉంచడం వల్ల మన ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. వీధుల్లో తయారు చేసే మోమోస్ లో ఇ.కోలి, లిస్టెరియా మోనోసైటోజెన్, బాసిల్లస్ సెరియస్ వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు తీవ్రమైన జీర్ణకోశ సమస్యలను కలిగిస్తాయి.

పానీ పూరి లేదా గోల్ గప్ప
పానీపూరి.. బహుశా దీన్ని ఇష్టపడని వారు ఉండరేమో.. సాయంత్రం అయ్యిందంటే చాలు.. కొందరు పానీపూరి బండి వద్ద క్యూ కట్టేస్తుంటారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ అమితంగా ఇష్టపడే పానీ పూరి.. స్ట్రీట్ ఫుడ్ లో అత్యంత ప్రమాదకరమైనది వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇందులో డేంజరస్ బ్యాక్టిరియాతో పాటు రసాయనాలు కూడా ఉంటాయని అంటున్నారు. అంతేకాదు పానీపూరిలో ఉపయోగించే వడకట్టని నీరు వల్ల కలరా బారిన పడే ప్రమాదం ఉందని అంటున్నారు. కొన్నిసార్లు మసాలా నీటిలో ఉపయోగించే సింథటిక్ రంగులు కూడా మన ఆరోగ్యంపై పెను ప్రభావం చూపిస్తాయి. పానీపూరి వల్ల గుండె జబ్బులు, ఇమ్యూనిటీ డిజార్డర్స్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
కేవలం షవర్మా, మోమోస్, పానీ పూరి మాత్రమే కాదు.. అందరూ ఇష్టపడే చైనీస్ డిష్ మంచూరియా కూడా ప్రాణాంతకమేనని అంటున్నారు వైద్యులు. ఇటీవల మంచూరియాను కర్నాటక ప్రభుత్వం నిషేధించింది. పానీపూరీపై కూడా వేటు వేయాలనే ఆలోచన ఉంది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×