Vijay Devarakonda: విజయ్ దేవరకొండ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నువ్విలా, ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ కెరీర్ ను ప్రారంభించాడు. ఇక పెళ్లి చూపులుసినిమాతో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. సినిమాలో చూపించిన యాటిట్యూడ్ నే బయట కూడా చూపించి.. పర్సనల్ గా అభిమానుల మనసులను గెలుచుకున్నాడు.
అర్జున్ రెడ్డి తరువాత గీతగోవిందం, టాక్సీవాలా సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. కొన్ని సినిమాలు ప్లాప్ అయినా కూడా కల్ట్ క్లాసిక్ సినిమాలుగా మంచి పేరు తెచ్చుకున్నాయి. అయితే అర్జున్ రెడ్డి సినిమా సమయంలో ఉన్నంత యాటిట్యూడ్ ఇప్పుడు లేదు. అందుకు కారణం విజయ్ కు వరుసగా ప్లాపులు రావడమే. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు విజయ్ అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి హిట్ ను మళ్లీ అందుకోలేదనే చెప్పాలి.
డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, నోటా, లైగర్, ఖుషీ, ది ఫ్యామిలీ స్టార్.. ఇవేమి విజయ్ కు ఆశించినంత ఫలితాన్ని అందించలేకపోయాయి. ప్రస్తుతం VD ఆశలన్నీ.. కింగ్‌డమ్ సినిమాపైనే పెట్టుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నాడు. నేడు రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను కూడా పెంచేసింది.
టీజర్ బావుంది.. విజయ్ లుక్ బావుంది.. కథ కూడా కొద్దిగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంది. అయితే ఇక్కడే ఒక సెంటిమెంట్ ను నెటిజన్స్ వెలికితీశారు. విజయ్ దేవరకొండ చొక్కా విప్పిన ఏ సినిమా హిట్ అందుకోలేదని చెప్పుకొస్తున్నారు. షర్ట్ లెస్ పోస్టర్స్ ను రిలీజ్ చేసిన ఏ సినిమా కూడా ఆయనకు హిట్ ను అందివ్వలేదని, ఉదాహరణలతో సహా చెప్పుకొస్తున్నారు.
VD12 Teaser: ఏంటీ.. రక్తపాతం గౌతమ్.. మళ్లీరావా తీసిందసలు నువ్వేనా ?
విజయ్ దేవరకొండ టాక్సీవాలా లాంటి హిట్ సినిమా తరువాత డియర్ కామ్రేడ్ చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ, ఫ్యాన్స్ కు మాత్రం నచ్చింది. ఇక దీని తరువాత వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020 లో రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. ఇందులో విజయ్.. చొక్కా విప్పి నడిరోడ్డుపై రాశీతో గొడవపడతాడు. ఆ లుక్ ను పోస్టర్ లా రిలీజ్ చేశారు. ఇందులో నటనకు, ఆ కథకు ప్రేక్షకులు దండం పెట్టారు.
ఇక వరల్డ్ ఫేమస్ లవర్ పెద్ద డిజాస్టర్ అందుకున్నా.. ఆ తరువాత ఎలాగైనా విజయ్ నిలబడతాడు అనుకున్నారు. కానీ, విజయ్ లైఫ్ మొత్తాన్ని తిరగరాసిన సినిమా లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించాడు. ఇక ఈ సినిమా పోస్టర్ ఎంత పెద్ద వివాదాన్ని తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తిగా బట్టలు లేకుండా.. ప్రైవేట్ భాగానికి మాత్రం పూలు అడ్డుపెట్టి.. తన బాడీని చూపించాడు విజయ్. పోస్టర్ చూసి అబ్బో సినిమా ఎంత గొప్పగా ఉంటుందో అనుకోని వెళ్లిన అభిమానులకు షాక్ ఇచ్చాడు పూరి. అసలు ఈ సినిమాను ఎందుకు తీశారో అని తలలు బద్దలు కొట్టుకున్నవారు కూడా లేకపోలేదు. విజయ్ కెరీర్ గురించి చెప్పాలంటే లైగర్ కు ముందు లైగర్ కు తరువాత అని చెప్పేలా ఈ సినిమా మారింది.
ఇక ఈ రెండు సినిమాలు డిజాస్టర్ టాక్ ను అందుకున్నాయి. ఇప్పుడు విజయ్ కొత్త సినిమా కింగ్‌డమ్ పోస్టర్ లో కూడా విజయ్ చొక్కా విప్పే కనిపించాడు. దీంతో ఈ సినిమాపై భయాలను పెట్టుకుంటున్నారు అభిమానులు. గౌతమ్ తిన్ననూరి కథను ఎంత మంచిగా చూపించినా.. విజయ్ పై ఉన్న నెగిటివిటి .. ట్రోల్స్ తో సినిమాను ప్లాప్ చేస్తారనే భయం చాలా మందికి ఉంది. మరి ఈ చొక్కా సెంటిమెట్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది చూడాలంటే మే 31 వరకు ఆగాల్సిందే.