BigTV English

VD12 Teaser: ఏంటీ.. రక్తపాతం గౌతమ్.. మళ్లీరావా తీసిందసలు నువ్వేనా ?

VD12 Teaser: ఏంటీ.. రక్తపాతం గౌతమ్.. మళ్లీరావా తీసిందసలు నువ్వేనా ?

VD12 Teaser:  సాధారణంగా ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో యూనిక్  స్టైల్ ఉంటుంది. ఒకరు లవ్ స్టోరీస్ కు ఫేమస్.. ఇంకొకరు యాక్షన్ సినిమాలకు ఫేమస్. మరొకరు హిస్టారికల్ సినిమాలకు ఫేమస్.  ముందు వారు తెరకెక్కించిన సినిమాలను బతికి తదుపరి సినిమాపై అంచనాలు పెరుగుతూ ఉంటాయి. బోయపాటి సినిమా అంటే మాస్ యాక్షన్ ఉంటుంది. రాజమౌళి.. అంటే హిస్టారికల్. అనిల్ రావిపూడి అంటే కామెడీ. ఇలా  ఒక్కో డైరెక్టర్ ఒక్కో స్టైల్ లో సినిమాలు చేస్తూ ఉంటారు.


ఒక డైరెక్టర్  ఒక జోనర్ నుంచి బయటకు వచ్చి ఇంకో జోనర్ లోకి అడుగుపెట్టాడు అంటే.. అభిమానులకు కొంచెం షాకింగ్ గానే ఉంటుంది. క్లీన్ అండ్ డీసెంట్ లవ్ స్టోరీస్ తెరకెక్కించే సుకుమార్.. సడెన్ గా ప్లేట్ మార్చి పుష్ప లాంటి మాస్ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఇప్పుడు మరో డైరెక్టర్ సైతం ఇలాగే యూ టర్న్  తీసుకొని షాక్ ఇచ్చాడు. అతనే గౌతమ్ తిన్ననూరి.

2017 లో మళ్లీ రావా అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు గౌతమ్ తిన్ననూరి. అక్కినేని సుమంత్, ఆకాంక్ష సింగ్  జంటగా నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అన్ని లవ్  స్టోరీస్ లో మళ్లీ రావా చాలా భిన్నమైంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ప్రేమించిన అమ్మాయి అవును అంటే సంతోషపడడం.. కాదు అంటే ఆమె గురించి తలుచుకొని బాధపడడం తప్ప ఇంకేమి తెలియని ఒక ప్రేమికుడి కథ. ప్రేమంటే.. నాలుగు రోజులు కలిసి తిరిగి ఆ తరువాత విడిపోయి.. మరొకరిని ప్రేమించడం అని కాకుండా.. ప్రేమించిన అమ్మాయి ఇష్టాన్ని గౌరవించి.. ఆమె కోసం ఎన్నాళ్లయినా ఎదురుచూడడమే ప్రేమ అని నిరూపించాడు. ఇప్పటికీ ఈ సినిమా లవ్ ఫెయిల్యూర్స్ కు ఒక బ్రాండ్ అంబాసిడర్.


ఇక ఈ సినిమా తరువాత జెర్సీ సినిమాతో ఇంకోసారి హృదయాలను గెలుచుకున్నాడు గౌతమ్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాని, శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన ఈ సినిమా కూడా  ప్రేక్షకుల మనసులను గెలవడమే  కాకుండా అవార్డులను కూడా అందుకుంది. తండ్రీకొడుకుల మధ్య  అనుబంధం. కొడుకు ముందు హీరోగా నిలబడాలని ఒక తండ్రి ఆశ.. భార్య పుట్టింటి నుంచి ఇచ్చే డబ్బు తీసుకోకూడదనే ఆత్మాభిమానం.  చనిపోతాను అని తెలిసి కూడా కొడుకు కోసం ఒక తండ్రి అలుపెరగని పోరాటం చేసి గెలిచిన ఒక తండ్రి కథ జెర్సీ. తండ్రిగా నాని నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. జెర్సీ కథ, కథనం, డైలాగ్స్.. ప్రతిదాంట్లో గౌతమ్ తన మార్క్ ను చూపించాడు.

Chiranjeevi: ఎర్రి** మొహం..స్టేజిపై ఆ బూతులు ఏంటి చిరు.. ఛీఛీ.. మరి ఇంతలా.. ?

మళ్లీ రావా, జెర్సీ సినిమాలు  క్లాసిక్ మూవీస్. ఎమోషనల్ గా ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసే చిత్రాలు. ఇక ఈ చిత్రాల తరువాత గౌతమ్ తిన్ననూరి.. మరో సినిమాతో వస్తున్నాడు అంటే.. వీటికంటే ఇంకా బెస్ట్ తో వస్తాడు అనే అనుకుంటారు. జెర్సీ తరువాత  గౌతమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం VD12. విజయ్ దేవరకొండ హీరోగా  నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు  వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. VD 12 కు కింగ్డమ్ అనే  టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలిపారు.

ఎన్టీఆర్ బేస్ వాయిస్ తో ఈ టీజర్ మొదలయ్యింది. టీజర్ మొత్తం రక్తపాతంతో నింపేశాడు. టైటిల్ కు తగ్గట్లే సినిమా మొత్తం సామ్రాజ్యానికి కింగ్ ఎవరు అనేదాని కోసం పోరాటంలా కనిపిస్తుంది. సముద్రపు ఒడ్డున శవాలు.. యాక్షన్ సీన్స్.. విజయ్ ఊర మాస్ లుక్.. డైలాగ్స్.. ఇలా ఒకటి అని చెప్పేలేము. సడెన్ గా టీజర్ చూసినవారు.. ఈ సినిమాకు దర్శకుడు మళ్ళీరావా లాంటి లవ్ స్టోరీ తీసిన గౌతమ్ తిన్ననూరియేనా అని నోర్లు వెళ్లబెడుతున్నారు. ఆ రేంజ్ లో ఉంది. చివర్లో విజయ్ తగలబెట్టేస్తాను అని చెప్పిన డైలాగ్ నే  ఇప్పుడు గౌతమ్ డైరెక్షన్ గురించి చెప్పుకొస్తున్నారు. నిజంగా తగలబెట్టేశావ్ అని. మే 31 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమాతో గౌతమ్.. విజయ్ కు ఎలాంటి హిట్ ను ఇస్తాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×