AP Govt: రంజాన్ మాసం ప్రారంభం కాబోతోంది. ముస్లిం సోదరులు ఉపవాసం ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం.. కీలక ప్రకటన చేసింది. ఉపవాసం ఉంటున్న ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ఇదొక శుభవార్తగా చెప్పవచ్చు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం.
రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరీమణులు ఉపవాసం ఆచరిస్తారు. మార్చి 2వ తేదీన మాసం ప్రారంభం కానుంది, మొత్తం 30 రోజుల పాటు వీరు కఠిన ఉపవాస దీక్ష ఆచరిస్తారు. ఆ తర్వాత రంజాన్ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ ఉపవాస దీక్ష ఆచరించే సమయంలో, ముస్లింలు ఉదయాన్నే సహరి ఆచరిస్తారు. సాయంత్రం ఉపవాస దీక్ష విరమణ అంటే ఇఫ్తార్ సాగిస్తారు. చిన్నా పెద్ద తేడా లేకుండా రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం ఆనవాయితీ. అంతేకాకుండ ప్రతి ముస్లిం తప్పనిసరిగా ఐదు పూటలా నమాజును ఆచరిస్తారు. అలాగే తరావీహ్ నమాజును కూడ ఆచరిస్తారు.
ఇలా రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్ష, ప్రత్యేకమైన ప్రార్థనలతో బిజీగా ఉంటారు. అందుకోసమే ఏపీ ప్రభుత్వం ముస్లిం ప్రభుత్వ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ నెలలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు ఒక గంట ముందు తమ కార్యాలయాల నుండి వెళ్ళడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనితో ముస్లిం ఉద్యోగస్తులు ఉపవాస దీక్ష విరమణకు సమయం అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు, ముస్లిం ఉద్యోగస్తులు హర్షం వ్యక్తం చేశారు. మార్చి 2 నుండి 30 వరకు ఈ ఆదేశాలు అమలవుతున్నట్లు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది.
Also Read: తన పర్యటన అసలు గుట్టు చెప్పిన పవన్ కళ్యాణ్
కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, మసీదులలో పని చేసే మౌజన్, ఇమామ్ లకు అందించే గౌరవ వేతనంపై కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 5 వేల ఆదాయం లేని మసీదులకు ఈ నిర్ణయంతో మేలు చేకూరనుంది. ఇమామ్‌ల గౌరవ వేతనాన్ని రూ.10వేలు, మౌజన్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల చొప్పున కొనసాగిస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా మైనారిటీ వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మైనారిటీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అంతేకాకుండ అలయాలకు అందించే ధూపదీప నైవేద్యంపై కూడ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇలా అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని కూటమి నేతలు అంటున్నారు.