Shiva Raj Kumar:కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు దక్కించుకొని ప్రేక్షకులలో శివన్నగా చెరగని ముద్ర వేసుకున్నారు శివ రాజ్ కుమార్(Shiva Raj Kumar).స్వర్గీయ దిగ్గజ లెజెండ్రీ నటులు పునీత్ రాజకుమార్ (Puneeth Rajkumar)సోదరుడైన ఈయన తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్నారు.. అంతేకాదు అడిగితే స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కోలీవుడ్, టాలీవుడ్ తేడా లేకుండా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. రజినీకాంత్ (Rajinikanth)హీరోగా నటించిన జైలర్(Jailor)సినిమాలో గెస్ట్ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు.
అమెరికా వెళ్లిన శివన్న..
ఇదిలా ఉండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆయన సర్జరీ కోసం అమెరికాకు వెళ్లారు. ఈ మేరకు ఎయిర్పోర్ట్ వద్ద మీడియాతో ఈ విషయాన్ని పంచుకోవడం జరిగింది. ఇకపోతే శివరాజ్ కుమార్ ‘భైరతి రంగల్’ సినిమా విడుదల తర్వాత మరో కొత్త సినిమాను ప్రకటించలేదు. ఇక ఈ సినిమా సమయం నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారట. దీంతో అమెరికాలోని ప్రముఖ హాస్పిటల్ లో డిసెంబర్ 24వ తేదీన సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇకపోతే గత కొన్ని రోజులుగా శివ రాజ్ కుమార్ క్యాన్సర్ తో బాధపడుతున్నారంటూ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
మీడియాతో మాట్లాడిన శివన్న..
అయితే ఇప్పుడు ఆయన మాటలు వింటుంటే ఆ వార్తలకు నిజం కలిగించారని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. శివరాజ్ కుమార్ ఎయిర్పోర్ట్ బయట మాట్లాడుతూ..” ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగా ఉంది. ఎందరో అభిమానులు, సహా నటీనటుల నుంచి ఎంతో ప్రేమ నాకు లభిస్తోంది. వారందరి ఆశీస్సులు నేను పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కాస్త అనారోగ్యంగా ఉన్నానని, గతంలోనే ఈ విషయాన్ని మీతో తెలిపాను. అయితే ఈ విషయంలో మీడియా చాలా సంయమనం పాటించి, నాపై తప్పుగా వార్తలు ప్రచారం చేయలేదు. అందుకే మీడియా మిత్రులందరికి నా ధన్యవాదాలు. నేను సర్జరీ కోసం ఇలా వెళ్తున్నప్పుడు ఎవరిలోనైనా కాస్త ఆందోళనగా ఉంటుంది కదా.. చాలా విషయాలలో నేను ఎంతో ధైర్యంగా ఉంటాను. అయితే ఇలాంటి సమయంలో అభిమానులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులను చూసినప్పుడు ఎమోషనల్ అవుతాము. ఎవరు కూడా ఆందోళన పడకండి.. సర్జరీ పూర్తి చేసుకొని యు ఐ, మ్యాక్స్ సినిమాలను తప్పకుండా చూస్తాను”.. అంటూ తెలిపారు.
వచ్చే ఏడాదే తిరుగు పయనం..
ఇకపోతే శివన్న డిసెంబర్ 24వ తేదీన సర్జరీ కోసం ఫ్లోరిడా లోని మియామీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక అక్కడికి భార్య బిడ్డతో కలిసి ఆయన ఇప్పటికే చేరిపోయినట్లు సమాచారం. మళ్లీ జనవరి 26వ తేదీన ఇండియాకు తిరిగి వస్తానని తెలిపారు. ఇకపోతే ఈయనకు క్యాన్సర్ అంటూ వచ్చిన వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ క్యాన్సర్ అంటూ వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. అది క్యాన్సర్ కాదని, అయితే ఆ సమస్య ఏంటి? ఆ వ్యాధి పేరు ఏంటి? అనేది కూడా శివన్నకు కూడా తెలియదు అని గతంలో తెలిపారు. మరి ఇప్పుడు మియామీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి వెళ్లడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.