Sara Tendulkar: టీమిండియా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. సచిన్ కూతురిగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. స్టార్ కాకపోయినా సినిమా హీరోయిన్లకు మించిన అందంతో {Sara Tendulkar} క్రేజ్ తెచ్చుకుంది ఈ స్టార్ కిడ్. సారా టెండూల్కర్ కి సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు ఈనెల 5వ తేదీన సారా టెండూల్కర్ కొత్త బాధ్యతలను చేపట్టింది. సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్ (ఎస్టిఎఫ్) డైరెక్టర్ గా సారా టెండూల్కర్ బాధ్యతలు స్వీకరించింది.
Also Read: Virat Kohli: ఆస్ట్రేలియా మీడియాపై రెచ్చిపోయిన కోహ్లీ… వీడియో వైరల్
ఈ విషయాన్ని సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా స్వయంగా ప్రకటించారు. సారా {Sara Tendulkar} కి వైద్య, విద్యారంగంపై ఉన్న నాలెడ్జ్ ఈ సమాజానికి ఎంతో తోడ్పడుతుందని అన్నారు సచిన్. ఈమె లండన్ లోని యూనివర్సిటీ నుంచి క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ నూట్రిషన్ లో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు. ఇక సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ మారుమూల గ్రామాల్లోని పిల్లలకు వైద్య సేవలు అందించడమే కాకుండా వారిలో పోషకాహార లోపాన్ని సైతం తగ్గించేలా సహాయక కార్యక్రమాలు చేపడుతోంది. ఇక {Sara Tendulkar} సారా టెండూల్కర్ విషయానికి వస్తే.. ఈమె లవ్, రిలేషన్షిప్ విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది.
టీమిండియా యువ ఆటగాడు శుభ్మన్ గిల్ తో ప్రేమాయణం నడుపుతుందని ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్నాయి. వీరిద్దరూ గత నాలుగు ఏళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారని మీడియా కోడై కోస్తుంది. కానీ వీరి రిలేషన్షిప్ పై సారా {Sara Tendulkar} కానీ, గిల్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు ఫాలో కావడం, ఒకరి పోస్ట్ కి మరొకరు కామెంట్స్ చేయడంతో వీరి రిలేషన్ షిప్ పై వార్తలు వస్తూనే ఉంటాయి. అంతేకాదు తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని 5 టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన మూడవ టెస్ట్ కి సచిన్ కూతురు సారా హాజరైంది.
ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న సారా టీమ్ ఇండియాకి మద్దతు తెలిపింది. దీంతో ఆమె {Sara Tendulkar} ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆమె టీమిండియా కోసం రాలేదని, గిల్ కోసమే ఈ మ్యాచ్ కి హాజరైందని ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ఇక ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియా లోనే వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా బీచ్ లో సేదతీరుతున్న వీడియోని సారా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో చెర్రీలను గాల్లోకి ఎగరేసి తన నోటితో అందుకుంటున్న వీడియోని ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇక ఈ వీడియో చూసిన కుర్రకారు మీరు సినిమాలలోకి వస్తే బాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ అవుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు.