BigTV English

Shobana: అమితాబ్ తో సినిమా.. బట్టలు మార్చుకోవడానికి అక్కడకు వెళ్లమన్నారు

Shobana: అమితాబ్ తో సినిమా.. బట్టలు మార్చుకోవడానికి అక్కడకు వెళ్లమన్నారు

Shobana: సీనియర్ నటి శోభన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలబోసిన రూపం ఆమెది. అభినయం తో పాటు  నాట్యంలో కూడా శోభనను మించిన వారు లేరు. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది శోభన. దేశానికి గర్వకారణమైన మహిళలో శోభన మొదటి వరుసలో ఉంటుంది.  ప్రేమ, పెళ్లి లాంటి వాటికి దూరంగా  ఉండి.. నాట్యానికే తన జీవితాన్ని అంకితం చేసింది.


 

ఇక కెరీర్  పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె సినిమాల నుంచి తప్పుకొని ఒక నృత్యశాలను ప్రారంభించి తన కళను అందరికి నేర్పుతుంది. ఎంతోమంది అమ్మాయిలను నరక్తి మణులుగా తీర్చిదిద్దుతుంది. ఇక ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈ ఏడాది.. శోభనకు పద్మశ్రీ ఇచ్చి  గౌరవించింది. ఎన్నో ఏళ్లుగా సినిమాలకు దూరమైన శోభన గత నాలుగేళ్లుగా మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది.


 

గతేడాది కల్కి 2898 AD సినిమాతో తెలుగులోకి కూడా రీఎంట్రీ ఇచ్చింది శోభన. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో మరియమ్ పాత్రలో ఆమె నటన, యాక్షన్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఇక సినిమాలే కాకుండా శోభన సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గానే ఉంటుంది. తన స్టూడెంట్స్ డ్యాన్స్ ప్రాక్టీస్ ను వీడియోలుగా తీసి  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా శోభన అభిమానులతో కలిసి ముచ్చటించింది.  లైవ్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు తన రీతిలో సమాధానం చెప్పుకొచ్చింది.

 

ఇక ఈ లైవ్ లో ఒక  యూజర్..  బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి చెప్పమని అడుగగా ఆమె మాట్లాడుతూ.. ” అమితాబ్ బచ్చన్  చాలా  గొప్ప మనిషి. ఆయన అప్పుడు ఎలా ఉన్నారో  ఇప్పుడు అలానే ఉన్నారు. మానవత్వం ఎక్కువ ఉన్న గొప్ప వ్యక్తి.  నేను, ఆయనతో కలిసి కల్కి కన్నా ముందు  బాలీవుడ్ లో ఒక సినిమా చేశాను. అమితాబ్ పక్కన హీరోయిన్ గా నటించాను. అప్పట్లో  కేరళ నుంచి బాలీవుడ్ కు వెళ్ళినవారు చాలా తక్కువ.  ఆ సినిమాలోని ఒక పాట కోసం అహ్మదాబాద్ వెళ్లాం.

 

అమితాబ్ వస్తున్నారు అని తెలుసుకున్న అభిమానులు.. మేము షూటింగ్ చేస్తున్న సెట్ వద్ద గుమిగూడారు. అమితాబ్ కార్ వాన్ లో ఉన్నారు. ఈ సాంగ్ కోసం  ఎక్కువ దుస్తులు మార్చాల్సివచ్చింది. ఒక కాస్ట్యూమ్ తరువాత ఇంకో కాస్ట్యూమ్ మార్చుకోవడానికి నాకు కార్ వాన్ ఇవ్వలేదు. అక్కడ చిత్రబృందంలో ఒక వ్యక్తి ఉంటే ఆయనను బట్టలు మార్చుకోవాలి.. కార్ వాన్  ఎక్కడ అని అడిగాను. అందుకు ఆయన వాళ్లది కేరళ కదా. అక్కడనుంచి వచ్చినవాళ్లు అన్నింటికీ అడ్జెస్ట్ అవుతారు. పక్కనే చెట్టు ఉంది. దాని వెనుకకు వెళ్లి బట్టలు మార్చుకోమని చెప్పాడు. ఆ మాటలను కార్ వాన్ లో ఉన్న అమితాబ్ వాకీ టాకీ ద్వారా విని బయటకు వచ్చి.. ఆ వ్యక్తిపై అరిచారు. ఆ తరువాత ఆయన కార్ వాన్ ను నాకు ఇచ్చారు.  ఇప్పటికీ అమితాబ్ అలానే ఉన్నారు. సెట్ లో ఎవరు వచ్చినా లేచి నిలబడి విష్ చేస్తారు. అలా చేయాల్సిన అవసరం లేదు అన్నా కూడా వినరు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శోభన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×