Honeymoon Couple: ఇటీవల మధ్యప్రదేశ్ నుంచి హనీమూన్ కోసం అని మేఘాలయకు వెళ్లిన రాజ రఘవంశీ, అతడి భార్య సోనమ్ దంపతులు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. రాజ రఘువంశీ మరణించాడు. అతడిని తన భార్య సోనమ్ హత్య చేయించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఆ న్యూస్ మరవక ముందే మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి హనీమూన్‌కు వెళ్లిన మరో కపుల్ కనిపించకుండా పోయింది. యూపీకి చెందిన నవ దంపతులు సిక్కింలోని తీస్తా నదిలో కనిపించకుండా పోయారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన కౌశలేంద్ర ప్రతాప్ సింగ్‌కు అంకితా సింగ్ అనే యువతితో నెల క్రితం మ్యారేజ్ అయ్యింది. ఈ నవ దంపతులు హనీమూన్ కోసమని మే 24న సిక్కిం రాష్ట్రానికి వెళ్లారు. ఇలా చాలా రాష్ట్రంలో చాలా ప్రాంతాలు తిరగారు. అయితే వీరిని మృత్యువు వెంటాడింది. మే 29 న వారు ప్రయాణిస్తున్న కారుపై కొండ చరియలు విరిగిపడడంతో ప్రమాదం జరిగింది.
ALSO READ: Bangalore News: ఆమెకు పెళ్లయ్యింది.. లవర్ పిలిచాడని ఒయో రూమ్‌కు వెళ్లింది.. తలుపు తెరిచి చూస్తే!
దీంతో.. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి తీస్తా నదిలో మునిగిపోయింది. అయితే అప్పటికే వీరు ప్రయాణిస్తున్న కారులో దాదాపు 9 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొండ చరియలు విరిగి పడటంతో ఆ కారు వెయ్యి అడుగుల లోతున్న నదిలో పడిపోయినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఆ కారులో ఉన్న పర్యాటకులు అందరూ మిస్ అయ్యారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఇద్దరనీ రక్షించారు. అందులో కారు డ్రైవర్ మృతిచెందాడు.
ALSO READ: OTT Movie : 9 ఏళ్ల పిల్లాడి చుట్టూ తిరిగే ఆత్మలు… IMDbలో 8.2 రేటింగ్ తో భయపెడుతున్న హర్రర్ థ్రిల్లర్
గల్లంతైన మరో ఎనిమిది మంది ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, అటవీ శాఖ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే గల్లంతైన వారిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు నలుగురు, త్రిపుర రాష్ట్రానికి చెందినవారు ఇద్దరు ఉన్నారు. ఇక ఈ ఘటన జరిగి దాదాపు 10 రోజుల దాటినా.. ఇంకా ఎలాంటి అప్డేట్ లేదని యూపీ రాష్ట్రానికి చెందిన కౌశలేంద్ర ప్రతాప్ సింగ్ తండ్రి షేర్ బహదూర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజులు గడిచినా.. తన కుమారుడు, కోడలి ఆచూకీ లభించలేదని బాధను వ్యక్తం చేస్తున్నారు.