BigTV English

Akhanda 2 : బాలయ్యను చూసి నేర్చుకోండి.. ‘అఖండ 2’ టీజర్ ఎఫెక్ట్.. ఆ హీరోకి సలహాలిస్తున్న నెటిజన్స్

Akhanda 2 : బాలయ్యను చూసి నేర్చుకోండి.. ‘అఖండ 2’ టీజర్ ఎఫెక్ట్.. ఆ హీరోకి సలహాలిస్తున్న నెటిజన్స్

Akhanda 2 : నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల బాలయ్య సినిమా కథలను చాలా భిన్నంగా ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తన వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద తన సినిమాలు వందల కోట్ల కలెక్షన్లను రాబడుతున్నాయి. అఖండ సినిమా నుంచి మొదలుకొని బాలయ్య వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక చివరిగా డాకూ మహారాజ్(Daku Magaraj) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.


హై వోల్టేజ్ యాక్షన్..

ఇక ప్రస్తుతం బాలయ్య సినిమాల విషయానికి వస్తే ఈయన బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో అఖండ 2(AKhanda 2) సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో బోయపాటి, బాలయ్య కాంబో అంటేనే థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందే, అంత అద్భుతంగా హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటివరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బాక్సాఫీస్ ను  దడదడలాడించాయి. ఇప్పుడు మరోసారి బాలయ్య అఖండ 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.


త్రిశూలం సీన్స్…

ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. ఇక జూన్ 10వ తేదీ బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ముందు రోజు సాయంత్రమే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేసిన విషయాలు తెలిసిందే.  ఈ టీజర్ క్షణాల్లో సోషల్ మీడియాని షేక్ చేసింది. బాలయ్య చెప్పే పవర్ ఫుల్ డైలాగ్లతో పాటు త్రిశూలం సీన్ టీజర్ కు హైలెట్ గా నిలిచింది.  ఇక తమన్ బిజిఎం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈసారి కూడా థియేటర్లలో స్పీకర్లు బద్దలు కావడం ఖాయం. ఇక ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.


పవన్ కళ్యాణ్ అభిమాని ఈ టీజర్ గురించి మాట్లాడుతూ… తాను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెబుతున్నాను టీజర్ మాత్రం అదిరిపోయింది అఖండ సినిమా చూసినప్పుడే మా గుండెలు జారిపోయాయి, ఈసారి ఈ సినిమాని థియేటర్లో చూస్తే మాత్రం హార్ట్ ఎటాక్ రావడం ఖాయమని అలాంటివారు వెళ్ళద్దని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే బాలకృష్ణ గారు సినిమాల ఎంపిక విధానం చూసి చిరంజీవి గారు చాలా నేర్చుకోవాలి అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. బాలయ్య తన వయసుకు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ విషయంలో చిరంజీవి చాలా మారాలి అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ అభిమానులు చిరంజీవికి సలహాలు ఇవ్వడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. మొత్తానికి అఖండ 2 సినిమాతో మరోసారి  బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటారని స్పష్టమవుతుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×