BigTV English

Naga Chaitanya- Shobhita: శోభిత ప్రేమ కోసం చైతూ అలాంటి పని చేశారా..?

Naga Chaitanya- Shobhita: శోభిత ప్రేమ కోసం చైతూ అలాంటి పని చేశారా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య (Naga Chaitanya) ‘ఏ మాయ చేసావే’ సినిమాలో నటించిన సహనటి సమంత(Samantha)ను ప్రేమించి, 2017లో వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన నాలుగేళ్లకే విడాకులు తీసుకోవడంతో పలు రకాల విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా సమంతను టార్గెట్ చేస్తూ.. పలు రకాల కామెంట్లు చేశారు. అయితే ఆ మరుసటి ఏడాది అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ (Shobhita dhulipala)తో ప్రేమాయణం మొదలుపెట్టారు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. దాదాపు రెండు సంవత్సరాల పాటు రహస్యంగా ఎఫైర్ సాగించిన వీరు.. ఒకసారి లండన్ లో హోటల్లో కనిపించడంతో ఈ విషయం కాస్త ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.


ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న ప్రేమ జంట..

ఎప్పటికప్పుడు వీరిద్దరి గురించి పలు వార్తలు వచ్చినా.. ఏ రోజు కూడా బయట పెట్టలేదు. కానీ ఈ ఏడాది పెద్దలను ఒప్పించి ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ నిశ్చితార్థం కూడా రహస్యంగా జరిగింది. కానీ ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను అక్కినేని నాగార్జున తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ అధికారిక ప్రకటన చేశారు. దీంతో ఎట్టకేలకి రూమర్స్ కి ఎండ్ కార్డు పడింది. ఇక ఆ తర్వాత 2024 డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు ఇరు కుటుంబాలు, సినీ పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వివాహం తర్వాత శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకున్న ఈ జంట, ఇప్పుడు పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ బిజీగా మారారు.


ప్రేమ, పెళ్లిపై శోభిత కామెంట్స్..

ఇకపోతే తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇద్దరు పాల్గొని తమ ప్రేమ, పెళ్లి విషయాలను పంచుకున్నారు. శోభిత మాట్లాడుతూ.. “2018లో నేను నాగార్జున ఇంటికి వెళ్లాను. కానీ 2022 ఏప్రిల్ తర్వాతే నాగచైతన్యతో నాకు స్నేహం ఏర్పడింది. ఆ తరువాతే నేను ఇన్స్టాలో నాగచైతన్యను ఫాలో అయ్యాను. నాకు ఫుడ్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడు నేను చైతూ ని కలిసినా . ఫుడ్ గురించే నా అభిప్రాయాన్ని పంచుకునేదాన్ని. అయితే చైతూ మాత్రం నాతో తెలుగులో మాట్లాడమని తరచూ అడిగేవారు. అలా మాట్లాడటం వల్ల మా బంధం మరింత బలపడింది. ఇక నేను ఎప్పుడూ ఇన్స్టా లో యాక్టివ్ గా ఉంటాను.. నేను పెట్టే స్ఫూర్తివంతమైన కథనాలు, నా అభిప్రాయాలకు సంబంధించిన పోస్ట్లను చైతూ కూడా లైక్ చేసేవారు. ఇక నేను ముంబైలో ఉన్నప్పుడు చైతూ హైదరాబాద్ నుంచి నాకోసం ముంబైకి వచ్చేవారు. అలా మొదటిసారి మేం బయటకు వెళ్ళినప్పుడు నేను రెడ్ డ్రెస్, చైతూ బ్లూ సూట్ వేసుకున్నారు. ఆ తర్వాత కర్ణాటకలో ఉన్న ఒక పార్కుకు వెళ్ళాము. అంతేకాదు ఒకరికొకరం గోరింటాకు కూడా పెట్టుకున్నాము. తర్వాత జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కు కూడా వెళ్ళాము”.. అంటూ ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది శోభిత. మొత్తానికైతే శోభితాను పొందడానికి నాగచైతన్య ఆమెతో బాగానే మూవ్ అయ్యారే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×