BigTV English

Suchir Balaji Elon Musk: చాట్‌జిపిటి ఉద్యోగి సుచిర్ బాలాజీ మృతి ఆత్మహత్య కాదు.. ఎలన్ మస్క్ వ్యాఖ్యలు

Suchir Balaji Elon Musk: చాట్‌జిపిటి ఉద్యోగి సుచిర్ బాలాజీ మృతి ఆత్మహత్య కాదు.. ఎలన్ మస్క్ వ్యాఖ్యలు

Suchir Balaji Elon Musk| ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ప్రముఖ అమెరికన్ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓపెన్ ఎఐ కంపెనీ (చాట్‌జిపిటి మాతృక) సంస్థకు చెందిన ఒక యువ కంప్యూటర్ ఇంజినీర్ సుచిర్ బాలాజీ కొన్ని రోజుల క్రితం అనుమాస్పద స్థితిలో తన ఇంట్లో చనిపోయాడు. పోలీసులు అతడి మరణాన్ని ఆత్మహత్యగా చెప్పారు. కానీ ప్రస్తుతం ఎలన్ మస్క్ అది ఆత్మహత్య కాదు హత్య అని అనుమానం వ్యక్తం చేశారు.


నవంబర్ 26, 2024న అనుమాస్పద స్థితిలో చనిపోయిన సుచిర్ బాలాజీది హత్య అని అతని తల్లి పూర్ణిమా బాలాజీ న్యాయ పోరాటం చేస్తున్నారు. తన కొడుకు మరణాన్ని పోస్ట్‌మార్టం రిపోర్ట్ లో ఆత్మహత్య అని తేల్చారని అయితే.. అది తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అని ఆమె చెప్పారు. తన కొడుకు నివసిస్తున్న అపార్ట్ మెంట్ లో సామాన్లన్నీ ధ్వంసం చేసి ఉన్నాయని. బాత్ రూమ్ లో సుచిర్ బాలాజీ చనిపోయేముందు ఎవరితోనో తలపడినట్లు ఆధారాలున్నాయని ఆమె సందేహం వ్యక్తం చేశారు. ఇన్ని ఆధారాలున్నా పోలీసులు దాన్ని ఆత్మహత్య అని ముందుగానే తేల్చేయడంతో ఏదో కుట్ర జరిగిందని ఆమె ఆరోపించారు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో అధికారులు అవినీతికి పాల్పడినా తాను మాత్రం నాయ పోరాటం చేస్తానని.. అందుకే ఈ కేసులో ఎఫ్‌బిఐ చేత విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదంతా పూర్ణిమా బాలాజీ తన ట్విట్టర్ ఎక్స్ లో ఎలన్ మస్క్ కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.

ఆమె పోస్టు పై ఎలన్ మస్క్ స్పందిస్తూ.. ఇది ఆత్మహత్య కేసులా అనిపించడం లేదు అని కామెంట్ చేశారు.


Also Read: 2024లో భారత్ కోల్పోయిన మహానుభావులు వీరే..

ఓపెన్ ఎఐ కంపెనీలో కంప్యూటర్ ఇంజినీర్ అయిన సుచిర్ బాలాజీ చాట్ జిపిటి లోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని ట్రైనెంగ్ ఇచ్చేవాడు. అయితే చాట్ జిపిటి ట్రైనింగ్ కోసం కంపెనీ కావాలనే కాపీరైట్ మెటీరియల్ ఉపయోగించిందని.. ఇది చట్ట వ్యతిరేకమని సుచిర్ బాలాజీ బయటి ప్రపంచానికి తెలియజేశాడు. ఇలా జరిగిన కొన్ని నెలల తరువాత సుచిర్ బాలాజీ శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఇంట్లోనే శవమై కనిపించాడు. అతని మరణం ఆత్మహత్య అని శాన్ ప్రాన్సిస్కో చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు.

అయితే ఈ పోస్ట్ మార్టంలో అంతా మోసం అని, అందుకే ప్రైవేట్ డాక్టర్ల చేత తాను మరోసారి పోస్ట్ మార్టం చేయించానని సుచిర్ బాలాజీ తల్లి చెప్పారు. రెండో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అది ఆత్మహత్య కాదని ఆధారాలు లభించినట్లు ఆమె తెలిపారు. దీంతో పోలీసులు, విచారణ అధికారులపై తనకు అనుమానం ఉందని ఆమె అన్నారు. ఇంతకుముందు కూడా ఆమె తన కొడుకు మృతి కేసులో ఎలన్ మస్క్ సాయం కోరారు. దీనిపై ఎలన్ మస్క్ గతంలో ట్వీట్ కూడా చేశారు.

శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చెందిన ఇండియన్ అమెరికన్ సుచిర్ బాలాజీ యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా లో కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాడు. 2018లో బాలాజీ ఏఐ రీసెర్చ్ కోసం ఓపెన్ ఏఐ లో ఇంటర్న్ షిప్ చేశాడు. ఆ తరువాత యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి తిరిగి ఓపెన్ ఎఐ లోనే ఉద్యోగం పొందాడు. వెబ్ జిపిటి అనే ప్రాజెక్ట్ కోసం తొలిగా పనిచేశాడు. అదే తరువాత చాట్ జిపిటిగా మారింది.

సుచిర్ బాలాజీ (SUCHIR BALAJI) చాలా తెలివైన వాడు అని.. అందుకే అతడిని కంపెనీలో ఉద్యోగం ఇచ్చామని ఓపెన్ ఎఐ సహవ్యవస్థాపకుడు జాన్ షుల్ మ్యాన్ తెలిపారు. ఇంటర్వూలో అతని పర్ఫామెన్స్ చూసి తాను ముగ్ధుడైనపోయానన్నారు. కోడింగ్ లో సూక్ష్మంగా ఉండే ఎర్రర్స్ బగ్స్ ని కూడా చాలా ఈజీగా సుచిర్ బాలాజీ కనిపెట్టేసేవాడని కితాబిచ్చారు.

అయితే ది న్యూ యార్క్ టైమ్స్ మీడియా సంస్థకు సంబంధించిన కాపీ రైట్ కంటెంట్ ని ఓపెన్ ఏఐ (Open AI) ఉద్దేశపూర్వకంగానే దుర్వినియోగం చేసిందని.. చాట్ జిపిటీ ప్రాజెక్ట్ కోసం కాపిరైట్ డేటాని ఉపయోగిస్తున్నట్లు సుచిర్ బాలాజీ బాహ్య ప్రపంచానికి తెలియపరచాడు. దీంతో న్యూయార్స్ టైమ్స్ కంపెనీ కోర్టులో ఓపెన్ ఏఐ కంపెనీపై అక్టోబర్ నెలలో కేసు వేసింది. సుచిర్ బాలాజీ వద్ద తగిన ఆధారాలున్నాయని నవంబర్ 18 2024న న్యూయార్స్ టైమ్స్ కంపెనీ లాయర్ చెప్పారు. ఈ క్రమంలోనే నవంబర్ 26న సుచిర్ బాలాజీ అనుమాస్పదంగా చనిపోయాడు.

ఎలన్ మస్క్ (elon musk) కూడా ఒకప్పుడు ఓపెన్ ఏఐలో పెట్టుబడులు పెట్టారు. కానీ ఆ కంపెనీ యజమాన్యంతో విభేదాలు రావడంతో ఆయన ఉపసంహరించుకున్నారు. సొంతంగా గ్రాక్ ఏఐ పై పరిశోధనలు ప్రారంభించారు.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×