Shruti Haasan: విశ్వనటుడు కమలహాసన్ (Kamal Haasan) కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ (Shruti Haasan) తన తండ్రి సపోర్ట్ లేకుండానే తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకునే ప్రయత్నం చేసింది. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఐరన్ లెగ్ కాస్త గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించుకుంది. ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన శృతిహాసన్.. అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘గబ్బర్ సింగ్’:సినిమాలో నటించి మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. చివరిగా ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘సలార్’ సినిమాలో నటించి ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఇక ప్రస్తుతం రజనీకాంత్ (Rajinikanth ) నటించిన కూలీ (Coolie) సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్.. తన జీవితం గురించి, తన జీవితంలో తాను పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
విమానాల్లో తిరిగే స్థాయి నుంచీ ఆటోలో తిరిగే స్థాయికి..
శృతిహాసన్ మాట్లాడుతూ.. “మా తల్లిదండ్రులు విడిపోవడం మా జీవితంలో అత్యంత విషాదకరమైన ఘటన. వారి విడాకుల తర్వాత నేను, అమ్మ సారిక (Sarika) తో కలిసి ముంబైకి షిఫ్ట్ అయ్యాను. దీంతో నా జీవితం ఒక్కసారిగా మారిపోయింది. నాన్నతో ఉన్నప్పుడు మేము విమానాల్లో తిరిగేవాళ్లం. కానీ నాన్న నుంచి దూరం అయ్యాక.. ముంబైకి వెళ్లి, అక్కడ చిన్న ఇంట్లో అద్దెకు ఉండడం మొదలుపెట్టాము. ఇక లోకల్ లో ఆటో రిక్షా సహాయంతో ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చేది. అలా తక్కువ రోజుల్లోనే రెండు రకాలు జీవితాలను చూసాము. జీవితం ఎంత త్వరగా రంగులు మారుతుందో.. ఆ క్షణమే తెలిసింది. అప్పటికి ఇంకా నేను హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు. ఇక సంగీతం నేర్చుకోవడానికి విదేశాలకు వెళ్లాను. అప్పుడే సొంతంగా డబ్బులు సంపాదించి, స్వతహాగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను. ఇక స్వదేశానికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగాను. అప్పుడు నాన్న ఇన్ఫ్లుయెన్స్ ను నేను ఉపయోగించుకోలేదు. ఇక సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత నాకంటూ ఒక స్టేటస్ వచ్చిన తర్వాతనే నాన్నతో క్లోజ్ గా ఉండడం మొదలు పెట్టాను” అంటూ శృతిహాసన్ వచ్చింది. ఇంకా శృతిహాసన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కమల్ హాసన్, సారిక వైవాహిక జీవితం..
కమల్ హాసన్, సారిక విషయానికి వస్తే.. 1984లో ‘రాజ్ తిలక్’ సినిమా షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి , 1988లో వివాహం జరిగింది. వీరికి అక్షరాహాసన్ (Akshara Haasan), శృతిహాసన్ (Shruti Haasan)అనే కుమార్తెలు పుట్టారు. 16 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2004లో వీరు విడాకులు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం రజినీకాంత్ (Rajinikanth )’కూలీ’ సినిమాతో పాటు ఎన్టీఆర్ (NTR) , ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ పూర్తి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.