Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. పుష్ప మూవీతో నేషనల్ వైడ్ గా స్టార్ అయ్యాడు. ఆ మూవీ తర్వాత రీసెంట్ గా పుష్ప 2 మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విషయాన్నీ సొంతం చేసుకోవడంతో అల్లు అర్జున్ ఖాతాలో మరో హిట్ పడింది. ఈ మూవీ తర్వాత అతని రేంజ్ పూర్తిగా మారిపోయింది అని చెప్పాలి. ఒకవైపు విమర్శలు.. మరోవైపు సక్సెస్ సినిమాతో అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు . ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ అదుర్స్..
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఫ్యాషన్ ఐకాన్ అన్న విషయం తెలిసిందే. తనకు నచ్చినట్లు తన డ్రెస్సులను డిజైన్ చేసుకొని వేసుకుంటారు. అయితే ఈమధ్య పుష్ప 2 తర్వాత ఎక్కువగా తాను వేసుకొనే టీ షర్ట్ ల పై ఐకాన్ అని రాసి ఉంటుంది. పుష్ప 2 తొక్కిసలాట ఘటన తర్వాత ఆ బ్రాండ్ ను పక్కనపెట్టి నార్మల్ షర్ట్ లలో కనిపిస్తున్నాడు. తాజాగా మళ్లీ ట్రెండ్ ఫాలో అవుతూ కనిపిస్తున్నాడు. తాజాగా అల్లు అర్జున్ ఎయిర్ పోస్ట్ లో కనిపించాడు. అక్కడ కెమెరాలు ఆయనను బందించాయి. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో బన్నీ బ్లాక్ అండ్ బ్లాక్ లో కనిపించాడు. ఆయన పెట్టుకున్న క్యాప్ పై ఐకాన్ అని ఉంది. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఆ న్యూ లుక్ హీరో అదిరిపోయాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు నువ్వు ఐకాన్ అని అందరికి తెలుసు. మళ్లీ ప్రమోట్ చేసుకుంటున్నావా అని ట్రోల్స్ వినిపిస్తున్నాయి.. దీనిపై అల్లు అర్జున్ రియాక్ట్ అవుతారేమో చూడాలి..
Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. మెగా ఫ్యాన్స్ కు వెరీ స్పెషల్..
అల్లు అర్జున్ సినిమాలు..
గత ఏడాది అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ ఘన విజయాన్ని అందుకుంది. దాదాపు 1900 కోట్లకు పైగా వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్ని బ్రేక్ చేసింది.. ఈ మూవీ తర్వాత బన్నీ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడని ఆసక్తి ఆయన అభిమానుల్లో కనపడుతుంది. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చి లో ఈ మూవీని రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు.త్వరలోనే ఈ మూవీ గురించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..