Shruti Haasan: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ఇక ప్రస్తుతం లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraj)దర్శకత్వంలో రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న కూలీ (Coolie) సినిమాలో కీ రోల్ పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె రజనీకాంత్ వ్యక్తిత్వం గురించి చెబుతూనే మరొకవైపు డైరెక్టర్ పై ప్రేమ వొలకబోసింది.ఇక డైరెక్టర్ పై ఈమె మాట్లాడిన మాటలు వింటూ ఉంటే.. నిజంగా అతడి ప్రేమలో పడిపోయిందేమో అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
డైరెక్టర్ పై ప్రేమ వొలకబోస్తున్న శృతిహాసన్..
ఇకపోతే ప్రస్తుతం లోకేష్ కనగరాజు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వస్తున్న ఈ కూలీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సమ్మర్ స్పెషల్ గా మే ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సినిమాపై హైప్ పెంచడానికి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న శృతిహాసన్ మాట్లాడుతూ..” డైరెక్టర్ లోకేష్ కనగరాజు తో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికైనా ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అనుకున్నాను. ఇక నేటితో ఆ కల నెరవేరింది” అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే వీరిద్దరూ కలిసి గతంలో ఒక యాడ్ షూట్ చేయగా.. వీరిద్దరూ అప్పుడే ప్రేమలో పడ్డారనే వార్త నెట్టింట వైరల్ అయింది. ఇప్పుడు మరొకసారి తనకు ఇష్టమైన డైరెక్టర్స్ లో లోకేష్ పేరు చెప్పడంతో మరొకసారి వీరి ప్రేమ వార్తలు ఊపందుకున్నాయి. శృతిహాసన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు ప్రేమలో పడిపోయింది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కనీసం ఇప్పటికైనా పెళ్లి పీటలు ఎక్కుతుందా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే శృతిహాసన్ ప్రేమలో పడింది అంటూ వస్తున్న వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
శృతిహాసన్ ప్రేమ , బ్రేకప్..
ఇదిలా ఉండగా.. గతంలో ఈమె లండన్ కి చెందిన ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడి, కొన్ని రోజులకే అతడి నుండి విడిపోయింది. ఇక ఆ తర్వాత చాలాకాలం ఒంటరిగానే ఉండిపోయిన ఈమె అటు సినిమాలకు కూడా దూరంగా ఉంటూ.. ప్రశాంతమైన జీవితాన్ని గడిపింది. అయితే క్రాక్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి.. సక్సెస్ఫుల్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న సమయంలో.. డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికతో ప్రేమలో పడింది. ఇద్దరు డేటింగ్ చేసుకున్నారు. కలిసి జీవించారు కూడా.. ఇన్స్టాలో రీల్స్ చేస్తూ, ఈవెంట్లలో పాల్గొంటూ నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. అయితే ఏమైందో తెలియదు కానీ గత ఏడాది ఇద్దరూ విడిపోయారు. ముఖ్యంగా అతడితో కలిసి దిగిన ఫోటోలను శృతి డిలీట్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని అందరూ క్లారిటీ కి వచ్చారు. కానీ ఈ విషయంపై ఇద్దరూ కూడా స్పందించలేదు. ఇంకా అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్న ఈమె ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటిస్తూ తాజాగా డైరెక్టర్ పై ప్రేమ వొలకబోస్తోంది. అందుకే నెటిజన్స్ అందరూ ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటుందా లేక ఇది కూడా యూజ్ అండ్ త్రో నా అంటూ కామెంట్లు చేస్తున్నారు..