Sara Ali Khan:బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Alikhan), అమృత సింగ్ (Amrita Singh) దంపతుల కుమార్తె సారా అలీ ఖాన్ (Sara AliKhan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా అవతరించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈమె.. అటు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూనే.. మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ అలరిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా అలీఖాన్ తొలిసారి తన తండ్రి సైఫ్ అలీఖాన్ పై దుండగులు కత్తితో దాడి చేసిన ఘటనపై స్పందించి ఆశ్చర్యపరిచింది.
ఆ 15 నిమిషాలు జీవిత కాలంలా అనిపించాయి – సారా అలీ ఖాన్
సారా అలీఖాన్ మాట్లాడుతూ.. “నాన్నపై దాడి జరిగిన ఆ క్షణాలు నాకు పెద్దగా గుర్తుకు లేవు. ఎందుకంటే ఆ విషయం తెలిసి అందరం ఒక్కసారిగా షాక్ అయ్యాము. ఏం జరుగుతోందో కూడా అర్థం కాలేని పరిస్థితి. ఆయనకు ఏమీ కాలేదు. అందుకు మేము ఎంతో అదృష్టవంతులం. ఆసుపత్రికి చేరుకునే వరకు కూడా మాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అందరూ మాకు చెబుతూనే ఉన్నారు. ఆ 15 నిమిషాలు నాకు ఒక జీవితకాలంలా అనిపించింది. ఇక చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి నాన్న చిరునవ్వుతో బయటకి వస్తున్న సమయంలో నా మనసు కుదుటపడింది. ప్రశాంతంగా అనిపించింది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా కంగారు పడకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన చాలా నిబ్బరంగా వ్యవహరించారు. నిజం చెప్పాలి అంటే మా నాన్నది పోరాట మనస్తత్వము. విషయం ఏదైనా సరే ఆయన చివరి వరకు పోరాడుతారు. ఖచ్చితంగా సాధిస్తారు కూడా
అయితే నేను అలా కాదు ..ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురైతే ముందే కన్నీళ్లు పెట్టుకొని, కంగారు పడిపోతాను” అంటూ తన తండ్రి పై జరిగిన దాడి గురించి చెప్పుకొని ఎమోషనల్ అయింది సారా అలీఖాన్.
Devara Movie: డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన దేవర బ్యూటీ.. మరీ అంత దారుణమా..?
సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు దాడి..
ఇకపోతే ఈ ఏడాది జనవరి 16వ తేదీన సైఫ్ పై దుండగుడు దాడి చేశారు. అర్ధరాత్రి సమయంలో సైఫ్ ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఆయన చిన్న కుమారుడు జహంగీర్ గదిలోకి ప్రవేశించబోయాడు. అతడిని గుర్తించిన ఆ ఇంటి సహాయకురాలు పెద్దగా కేకలు వేయడంతో.. అక్కడికి సైఫ్ చేరుకున్నాడు. ఈ క్రమంలోనే కాస్త వివాదం చోటు చేసుకోగా.. ఆ దుండగుడు సైఫ్ పై కత్తితో దాడి చేశాడు. ఇక సైఫ్ వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో సర్జరీ చేశారు. ఇక ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయంపై అటు సైఫ్ అలీఖాన్ కూడా స్పందించి ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు.ఆ దుండగుడు డబ్బు కోసమే సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడినట్లు పోలీసులు నిర్ధారించారు. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.