BigTV English

Shruti Haasan: స్వచ్ఛమైన ప్రేమ కావాలంటున్న శృతి.. దాని ప్రభావమేనా..?

Shruti Haasan: స్వచ్ఛమైన ప్రేమ కావాలంటున్న శృతి.. దాని ప్రభావమేనా..?

Shruti Haasan:ప్రముఖ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అనతి కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె.. లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే తండ్రి పేరును ఎక్కడ కూడా ఉపయోగించకుండా సింగర్ గా, నటిగా తనకంటూ ఒక పేరును సొంతం చేసుకుంది. మొదట కోలీవుడ్ లోనే నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన శృతిహాసన్.. ఆ తర్వాత తెలుగు, హిందీ, హాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ లో కొనసాగుతోంది. ఇక శృతిహాసన్ సినిమాల విషయంలో ఎంతటి శ్రద్ధ వహిస్తుందో అటు వ్యక్తిగత జీవితంలో కూడా అలాగే వ్యవహరిస్తుందని అందరికీ తెలిసిందే. అయితే ఈమె ఎలాంటిది అంటే.. తన పర్సనల్ విషయాలను కూడా పబ్లిక్ లో పెట్టే రకం. అందుకే ఈమె వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితం రెండూ కూడా ఓపెన్ బుక్ అనే చెప్పుకోవాలి.


స్వచ్ఛమైన ప్రేమ కావాలి – శృతి హాసన్

ఎప్పుడు నిష్పక్షపాతంగా.. ముక్కుసూటిగా మాట్లాడే శృతిహాసన్.. తాజాగా ఫిలింఫేర్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. స్వచ్ఛమైన ప్రేమ కావాలి అని, ఈ మోసపూరిత ప్రేమల వల్ల తాను మానసికంగా క్షోభ అనుభవించాను అంటూ తెలిపింది. ఇక దీనిపై శృతిహాసన్ మాట్లాడుతూ..” నేను ఎలాంటి బాధ లేకుండా రిలేషన్షిప్ ను ముగించేశాను. ఎందుకంటే నేను నా వరకు నిజాయితీగా ఉంటాను. అందుకే కావచ్చు చాలామంది ఎప్పుడూ నన్ను ఎన్నో నెంబర్ బాయ్ ఫ్రెండ్ తో ఉన్నా అంటూ మాట్లాడుతారు. కానీ అది అందరి విషయంలో కేవలం నంబర్ మాత్రమే కానీ నా విషయంలో నేను అన్నిసార్లు ప్రేమలో విఫలం అవుతూనే వస్తున్నాను అంటే దానికి కారణం నేను కోరుకున్న నిజమైన ప్రేమను పొందడంలో పదేపదే విఫలం అవుతున్నానని అర్థం. అందుకే ఇలాంటి విషయాలకు పెద్దగా బాధపడను. కానీ నేను కూడా మనిషినే కాబట్టి కొన్ని సందర్భాలలో బాధ కలుగుతూ ఉంటుంది. అలా అని ఆ విషయంలో ఎవరిని కూడా నేను నిందించను. ఎందుకంటే ఒకరితో మనం కలిసినప్పుడు ఒకే సమయంలో మారిపోవడం అనేది అంత సులభం కాదు.. అలా నేను కూడా మారిపోవాలని ఎప్పుడూ ఆలోచించలేదు” అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్. మొత్తానికైతే తనకంటూ ఒక స్వచ్ఛమైన ప్రేమ కావాలి అని తనను తనలాగే చూసే వ్యక్తి కావాలని కోరుకుంటుంది శృతిహాసన్. మరి అలాంటి స్వచ్ఛమైన ప్రేమ ఈ కాలంలో శృతిహాసన్ కి ఎక్కడ.. ఎప్పుడు.. దొరుకుతుందో చూడాలి.


శృతిహాసన్ సినిమాలు..

శృతిహాసన్ సినిమాల విషయానికొస్తే.. శృతిహాసన్ మొదట తెలుగులో అడవి శేషు హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో అవకాశం అందుకుంది. కానీ మేకర్స్ తో కాస్త విభేదాలు ఏర్పడడం వల్లే సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు మరో చిత్రంలో కూడా శృతిహాసన్ నటిస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×