Suriya: ప్రస్తుతం ఒక సినిమా ప్రేక్షకులకు రీచ్ అవ్వాలంటే ప్రమోషన్స్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక సినిమాను మంచిగా ప్రమోట్ చేస్తే అది ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. దానివల్ల చాలామంది దానిని థియేటర్లలో చూడడానికి ముందుకొస్తారు. అందుకే స్టార్ హీరోలు సైతం ఒక సినిమాలో నటించిన తర్వాత దానిని ప్రమోట్ చేయడానికి మళ్లీ అదే రేంజ్‌లో కష్టపడతారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అదే పని చేస్తున్నాడు. సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెట్రో’ ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తున్నాడు సూర్య. ఆ మూవీ ప్రమోషన్స్ సమయంలో తన కో స్టార్ పూజా హెగ్డేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సెన్సేషనల్ పాట
కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటించిన ‘రెట్రో’లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే సినిమా నుండి విడుదలయిన అప్డేట్స్‌ను చూస్తుంటే సూర్య, పూజా పెయిర్ చాలా కొత్తగా అనిపిస్తుందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. అయితే ఒక మూవీ రిలీజ్‌కు హైప్ క్రియేట్ అవ్వాలంటే అందులోని పాట గానీ, డైలాగ్ గానీ.. ఏదో ఒకటి వైరల్ అవ్వాలి. అలాగే ‘రెట్రో’ నుండి ‘కన్నీమా’ అనే పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దానికి సంబంధించిన హుక్ స్టెప్‌ను అందరూ చేసి చూపిస్తూ, దానిపై రీల్స్ షేర్ చేస్తూ ఉన్నారు. తాజాగా ‘రెట్రో’ (Retro) ప్రమోషన్స్‌లో ‘కన్నీమా’ పాట అంతలా ట్రెండ్ అవ్వడంపై స్పందించాడు సూర్య.
తనవల్లే ఇదంతా
‘‘పూజా హెగ్డే (Pooja Hegde)నే కన్నీమా పాటను వైరల్ చేసింది. అందులో తన పాత్ర చాలా ఉంది. తనే నాకంటే ఎక్కువగా రెట్రోను ప్రమోట్ చేసింది. తను వేరే పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడికి రాలేదు’’ అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చాడు సూర్య. మొత్తానికి ఒక స్టార్ హీరో అయ్యుండి ఒక హీరోయిన్‌కు క్రెడిట్ ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ సూర్య మాత్రం ఎలాంటి ఈగో లేకుండా తన కో స్టార్లను సపోర్ట్ చేస్తాడు. అందుకే తనకు తమిళంలో మాత్రమే కాదు.. తెలుగులో కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ‘రెట్రో’పై తమిళ ప్రేక్షకుల్లోనే కాదు.. తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read: హీరోలు అలా నటించి మోసం చేస్తున్నారు.. ప్రభాస్ బ్యూటీ ఆవేదన
దర్శకుడిపై నమ్మకం
సూర్య (Suriya) హీరోగా నటించిన చివరి చిత్రం ‘కంగువా’ బాక్సాఫీస్ వద్ద భారీ డిశాస్టర్‌గా నిలిచింది. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం సూర్య చాలానే కష్టపడ్డాడు. తనను తాను చాలా మార్చుకున్నాడు. ప్రమోషన్స్ విషయంలో కూడా ఒక్కడే దేశవ్యాప్తంగా టూర్స్ నిర్వహిస్తూ ‘కంగువా’ను ప్రమోట్ చేశాడు. కానీ ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. అందుకే సూర్యకు ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ చాలా అవసరం. అందుకే కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెట్రో’పైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నాడు. కార్తిక్ సుబ్బరాజ్ సినిమా బాగుంటాయి కాబట్టి ‘రెట్రో’ కూడా పక్కా హిట్ అవుతుందని నమ్ముతున్నారు. మే 1న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది.