Basheer Master :’పాడుతా తీయగా’.. గత 25 సంవత్సరాలుగా బుల్లితెరపై నిర్విరామంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఉండే వారిని మొదలుకొని పట్టణాల వరకూ.. టాలెంట్ ఉండే ప్రతి ఒక్కరు కూడా పాటలు పాడుతూ.. తమలోని సింగర్ ను బయటకు తీస్తూ సమాజానికి పరిచయం అవుతున్నారు. ఈ క్రమంలోనే దివంగత లెజెండ్రీ సంగీత గాయకులు ఎస్పీ సుబ్రహ్మణ్యం (SP Bala Subrahmanyam) హోస్టుగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని.. ఇప్పుడు ఆయన తనయుడు ఎస్పీ చరణ్ (SP Charan) కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సింగర్ సునీత (Singer Sunitha), లిరిసిస్ట్ , ఆస్కార్ గ్రహీత చంద్రబోస్(Chandrabose), ఆస్కార్ గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి(MM Keeravani) జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు.
తనకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేసిన ప్రవస్తి..
ఇప్పటివరకు ఈ కార్యక్రమంపై ఎటువంటి మచ్చ పడలేదు. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం సిల్వర్ జూబ్లీ సీజన్ కొనసాగుతున్న సమయంలో.. తనకు అన్యాయం జరిగిందని, తనపై పక్షపాతం చూపించారని, తనను, తన తల్లిని అవమానించారంటూ సింగర్ ప్రవస్తి (Singer Pravasthi) చేసిన ఆరోపణలు ఒక్కసారిగా గుప్పమన్నాయి. ముఖ్యంగా ఎం.ఎం. కీరవాణి, చంద్రబోస్, సునీత తనను టార్గెట్ చేశారని, బాడీ షేమింగ్ చేశారని, అంతేకాకుండా బొడ్డు కిందకు చీర కట్టుకొని రమ్మని టార్చర్ చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.అంతేకాదు సింగర్ ప్రవస్తి వరుసగా పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ.. పాడుతా తీయగా కార్యక్రమంలో తనకు జరిగిన అన్యాయం గురించి ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉంటే.. సింగర్ సునీత స్పందించి.. ప్రవస్తీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. “షో లో నువ్వు మొదటగా పాల్గొన్నప్పుడు చాలా చిన్న దానివి. ముద్దుగా పాడే దానివి. అప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేశాము. ఇప్పుడు నీకు 19 సంవత్సరాలు. ఇప్పుడు కూడా ముద్దు చేయాలంటే కుదరదు కదా.. చెప్తే అన్ని నిజాలు ఒకేసారి బయట పెట్టు” అంటూ కూడా కామెంట్లు చేసింది. దీంతో రియాక్ట్ అయిన సింగర్ ప్రవస్తి ప్రశ్నల వర్షం కురిపిస్తూ అవతల వారికి సమాధానాలు చెప్పని రీతిలో తన బాధను వెల్లబుచ్చుకుంది.
కీరవాణికి నోటి దూల ఎక్కువ – బషీర్ మాస్టర్
ఇక ఇలా సింగర్ ప్రవస్తి వీడియోలు రోజురోజుకీ వైరల్ అవుతున్న నేపథ్యంలో కొంతమంది సింగర్ ప్రవస్తి పై మండిపడగా.. మరి కొంతమంది ఆమెకు అండగా నిలిచారు. ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్ (Basheer master) కూడా సింగర్ ప్రవస్తికి సపోర్టుగా నిలుస్తూ.. సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి పై మండిపడ్డారు. ఇకపోతే పాడుతా తీయగా కార్యక్రమంలో ఎం ఎం కీరవాణి ప్రవస్తిని తక్కువ చూపు చూస్తూ ఆమె పెళ్లిళ్లలో పాటలు పాడుతుంది.. ఏమంత గొప్ప.. అలాంటి వాళ్ళు సింగర్ అవుతారా అంటూ కాస్త నిర్లక్ష్యంగా, తక్కువ చేసి కీరవాణి మాట్లాడిన మాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి ఇప్పుడు ఇదే విషయంపై బషీర్ మాస్టర్ కు ప్రశ్న ఎదురుగా ఆయన మాట్లాడుతూ.. “ఎం ఎం కీరవాణి ఎంత స్టార్ స్టేటస్ లో అయినా ఉండనివ్వండి. కానీ ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు.. ఆయన కూడా ఒకప్పుడు ఇలాంటి స్టేజ్ నుంచే వచ్చారు కదా.. అంతెందుకు మొన్న అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకల్లో ఏ.ఆర్ రెహమాన్ ని మొదలుకొని హాలీవుడ్ రేంజ్ సింగర్లు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాటలు పాడారు. వారందరికీ కూడా అంబానీ డైమండ్ వాచ్ బహుమతిగా ఇచ్చారు. మరి వీరిని ఏమంటారు. దీనిని నోటి దూల అంటారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్.. ఆయన ఎంతటి వారైనా సరే.. ఆచితూచి మాట్లాడాలి. ఒక అమ్మాయిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడటం తప్పు. ఈ విషయంలో ఎం ఎం కీరవాణికి నోటి దూల ఎక్కువ ” అంటూ బషీర్ మాస్టర్ కామెంట్ చేశారు.. మొత్తానికైతే బషీర్ మాస్టర్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Sreemukhi Remuneration : సుమక్కను మించిన డిమాండ్ రాములక్కది… ఒక్కో షోకి ఎన్ని లక్షలంటే..?