Subham Collections : పాన్ ఇండియా హీరోయిన్ అంటే ఫస్ట్ లిస్ట్ లో ఉంటుంది సమంత. సౌత్ లో స్టార్ హోదా తెచ్చుకున్న తర్వాత నార్త్ లో డైరెక్ట్ సినిమాలేవీ చేయకున్నా.. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్ వంటి వెబ్ సిరీస్ లు చేసి,.. అక్కడి ఆడియన్స్ కి కూడా సామ్ దగ్గరైంది. ఇప్పుడు అక్కడే రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది.
ఇలా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూనే… ప్రొడ్యూసర్ గా కూడా మారిపోయింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ను స్టార్ట్ చేసి, అందులో సినిమాలు చేస్తుంది. ఇటీవల ఈ బ్యానర్ నుంచి ఫస్ట్ మూవీ వచ్చింది. శుభం అనే టైటిల్ తో వచ్చిన ఈ మూవీ.. సమంతను నిర్మాతగా నిలబెట్టింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దాదాపు 4 నుంచి 5 కోట్ల అతి తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రెడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
సమంతకు లాభమే…?
శుభం సినిమాను సమంత నిర్మించడానికి దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు అయినట్టు తెలుస్తుంది. అయితే నాన్ థియేట్రికల్ అంటే ఆడియో రైట్స్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ వల్ల ఈ సినిమాకు దాదాపు 4 కోట్ల వరకు రిటర్న్స్ వచ్చాయట. ఇక థియేట్రికల్ బిజినెస్ కొన్ని చోట్ల షేరింగ్, కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొన్నారు. అలా వచ్చిన డబ్బుతో శుభం సినిమా రిలీజ్ కు ముందే సమంతకు టేబుల్ ప్రాఫిట్స్ అయితే వచ్చేసినట్టే.
మరి డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి నష్టమే…?
శుభం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది నిజమే. కానీ, అది అన్ని సెంటర్స్ నుంచి రాలేదు. హైదరాబాద్ తో పాటు కొన్ని ప్రధాన జిల్లా సెంటర్స్ లో ఉండే థియేటర్స్ లో శుభం సినిమాకు టాక్ పర్లేదు. కానీ, బీసీ సెంటర్స్ లోనే పరిస్థితి వేరేలా ఉంది. బీసీ సెంటర్ ఆడియన్స్ ఓన్లీ మాస్ అండ్ యాక్షన్ సినిమాలకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఇలాంటి కామెడీ సినిమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు శుభం సినిమా విషయంలో కూడా అదే జరిగింది.
కామెడీ, హర్రర్ జానర్ లో వచ్చిన ఈ సినిమాను బీసీ సెంటర్ ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వచ్చే కలెక్షన్ల శాతం ఆ బీసీ సెంటర్స్ నుంచి చాలా అంటే చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చే కలెక్షన్లు అన్నీ కూడా ఎక్కువ శాతం హైదరాబాద్ తో పాటు కొన్ని ప్రధాన జిల్లా కేంద్రాల్లో ఉండే థియేటర్స్ నుంచే అని చెప్పొచ్చు.
సమంతను నమ్ముకుని…
శుభం సినిమాకు సమంత ప్రొడ్యూసర్ అని మాత్రమే కాదు. ఆ సినిమాలో సమంత నటించింది… అనే రీజన్ వల్లే కొంత మంది డిస్ట్రిబ్యూటర్లు శుభం మూవీ రైట్స్ తీసుకున్నారు. కానీ, ఆ సినిమాలో సమంత పాత్ర చాలా పేలవంగా ఉంటుంది. దీంతో బీసీ సెంటర్స్ లో శుభం సినిమా ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోవడం లేదు.