BigTV English

Rotten food in Trains: వందే భారత్ లో పాచిపోయిన చికెన్, కుళ్లిన గుడ్లు.. రైల్వే క్యాంటిన్ అరాచకం!

Rotten food in Trains: వందే భారత్ లో పాచిపోయిన చికెన్, కుళ్లిన గుడ్లు.. రైల్వే క్యాంటిన్ అరాచకం!

Indian Railways Food: భారతీయ రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్నిస్తోంది. అత్యాధునిక రైళ్ల నుంచి అదిరిపోయే స్పెసిలిటీస్ వరకు అందిస్తోంది. ఇక రైళ్లలో అందించే ఫుడ్ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రయాణీకులకు హైజినిక్ ఫుడ్ సరఫరా చేస్తున్నట్లు చెప్తోంది. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.  ఏమాత్రం క్వాలిటీ లేని ఆహార పదార్థాలను ఉపయోగించడంతో పాటు చెడిపోయిన వంటకాలను ప్రయాణీకులకు అందిస్తున్నారు. తాజాగా కొచ్చిలోని రైళ్లకు ఆహారం సరఫరా చేసే క్యాంటీన్ మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఎటు చూసినా అపరిశుభ్రత, పాచిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. ఏమాత్రం నిబంధనలు పాటించని క్యాంటీన్ ను సీజ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.


గత కొద్ది రోజులుగా కొచ్చి క్యాంటీన్ పై ఫిర్యాదులు

నిజానికి గత కొద్ది రోజులుగా కొచ్చి కార్పొరేషన్‌ పరిధిలోని ఎర్నాకుళం డివిజన్‌ లో ఉన్న క్యాంటీన్ పై ప్రయాణీకల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఫుడ్ ఏమాత్రం క్వాలిటీ ఉండటం లేదని కంప్లైంట్ వచ్చాయి. స్థానికులు కూడా ఈ క్యాంటీన్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఈ క్యాంటీన్ మీద అధికారులు ఫోకస్ పెట్టారు. తాజాగా దాడులు చేశారు. కార్పొరేషన్ జారీ చేసే లైసెన్స్ లేకుండా ఈ క్యాంటీన్ ను నడిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.


కుళ్లిపోయిన చికెన్.. చెడిపోయిన గుడ్లు

ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు జరిపిన తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ క్యాంటీన్ లో కనీస పరిశుభ్రత పాటించడం లేదు. ఎక్కడ చూసినా చెడిపోయిన ఆహారంతో దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. ఈ క్యాంటీన్ నుంచి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లతో పాటు పలు రైళ్లకు ఫుడ్ సరఫరా జరుగుతున్నట్లు తెలిపారు. రైళ్లలో పంపిణీ చేయడానికి రెడీగా ఉంచిన ఆహార ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. “క్యాంటీన్ లో సుమారు 50 కిలోల కుళ్లిన చికెన్ దొరికింది. గత కొద్ది నెలలుగా ఈ చికెన్ ను నిల్వ చేస్తున్నట్లు గుర్తించాం. చెడిపోయిన ఎగ్స్, పప్పు కూడా ఉంది. ఇతర ఆహార పదార్థాలు కూడా క్వాలిటీగా లేవు. ప్రస్తుతం క్యాంటీన్‌ను సీజ్ చేశాం. క్యాంటీన్ కు కనీసం కార్పొరేషన్ అనుమతి పత్రం కూడా లేదు” ని పబ్లిక్ హెల్త్ అధికారులు వెల్లడించారు.

Read Also: 2 టికెట్స్ కన్ఫార్మ్, మరో 2 వెయిటింగ్ లిస్ట్, నలుగురూ జర్నీ చెయ్యొచ్చా?

గతంలోనే రూ. 10 వేల జరిమానా

ఇక కనీసం మురుగునీటి శుద్ధి చేయకుండా నేరుగా స్థానిక కాల్వలోకి పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆహార వ్యర్థాలను కూడా అందులో పడేస్తున్నట్లు గుర్తించారు.  గతంలోనూ ఈ క్యాంటీన్ కాలువలోకి వ్యర్థాలను పారవేసినందుకు రూ.10,000 జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్యాంటీన్ సీజ్ కు సంబంధించి రైల్వే నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read Also: విమానంలో షర్టులు విప్పి కూర్చున్న ప్రయాణీకులు.. ఏం చేస్తారు పాపం, పరిస్థితి అలాంటిది!

Related News

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Train Travel: రైలు ప్రయాణీకులకు ఇన్ని రైట్స్ ఉంటాయా? అస్సలూ ఊహించి ఉండరు!

Big Stories

×