BigTV English

Anchor Shyamala : అరెస్ట్ భయం..కోర్టు మెట్లేక్కిన శ్యామల.. నేడే విచారణ..

Anchor Shyamala : అరెస్ట్ భయం..కోర్టు మెట్లేక్కిన శ్యామల.. నేడే విచారణ..

Anchor Shyamala : ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా బెట్టింగ్ యాప్స్ పేరే వినిపిస్తుంది.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయని ఆ యాప్స్ ని ప్రమోట్ చేసిన సెలెబ్రిటీలపై పోలీసులు కొరడా ఝలిపించారు. బెట్టింగ్ యాప్స్ ని తమ స్వప్ ప్రయోజనాల కోసం ప్రమోట్ చేసిన కొంతమందిని పోలీసులు అదుపులో కి తీసుకొని విచారిస్తున్నారు. నిన్న విష్ణు ప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైంది. మొత్తం 15 మంది వరకు ఈ యాప్స్ ను ప్రమోట్ చేశారని పోలీసులు చెబుతున్నారు. ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిలో బుల్లితెర యాంకర్ శ్యామల కూడా ఉన్నారు.. ఆమెను పోలీసులు విచారణకు రావాలని నోటీసులు పంపారు అయితే తాజాగా శ్యామల ఈ కేసు పై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ పై నేడు విచారణ జరగుతుంది..


బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు సీరియస్..

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సెలబ్రిటీలకు ఉచ్చుబిగిస్తోంది. టీవీ యాంకర్స్ నుంచి సినిమా హీరోలు, ప్రముఖ నటుల వరకు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం తో అందరికీ నోటీసులు జారీ చేశారు పోలీసులు.. ఇప్పటికే 15 మందికి పైగా ఆన్లైన్ గెమింగ్ యాప్ లను ప్రమోట్ చేశారని పోలీసులు గుర్తించారు. కొందరు తప్పైంది.. తెలియక చేశామని వీడియోలు రిలీజ్ చేస్తుంటే.. మరి కొందరు చట్ట ప్రకారమే చేశామని ప్రకటిస్తూ సర్దిచెప్పుకేనే ప్రయత్నం చేస్తు్న్నారు. తెలియక చేసినా.. తెలిసి చేసినా తప్పు తప్పే. బెట్టింగ్ యాప్స్ వలన వేల మంది అమాయకులు బలయ్యారని తాము పంపిన నోటీసులకు రెస్పాండ్ అయ్యి విచారణకు హాజరుకావాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఒక్క సినిమాను కూడా మిస్ చెయ్యకండి..

హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల.. 

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన బుల్లితెర నటులు, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు, యాక్టర్లపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు పోలీసులు.. ఈ క్రమంలో యాంకర్ శ్యామల పై కేసు నమోదు అయ్యింది. ఆమె కేసు పై తెలంగాణ హైకోర్టును ఆశ్రాయించారు. బెట్టింగ్ యాప్ప్‌ ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్యామలపై FIR నమోదైంది. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్ట్‌లో శ్యామల పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. శ్యామల పిటిషన్‌పై నేడు విచారణ జరుగుతుంది. Andhra365 అనే ఆన్లైన్ గేమింగ్ యాప్ కు యాంకర్ శ్యామల ప్రమోషన్ చేసింది. ఈ కేసు విచారణ పై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు ఆమెకు అనుకూలంగా రాకుంటే అరెస్ట్ చేస్తారా? ఎన్ని రోజులుగా జైలులో ఉండాలి..? ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి హైకోర్టు తీర్పు ఆమెకు అనుకూలంగా వస్తుందో లేదో కాసేపట్లో తెలియనుంది.

ఇకపోతే ఏపీలో యాంకర్ శ్యామలకు పూర్తి వ్యతిరేఖత ఉందన్న విషయం తెలిసిందే.. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×