BigTV English

Cloves: భోజనం తర్వాత లవంగాలు తింటే.. ఎన్ని లాభాలో తెలుసా ?

Cloves: భోజనం తర్వాత లవంగాలు తింటే.. ఎన్ని లాభాలో తెలుసా ?

Cloves: ఆహారం తిన్న తర్వాత లవంగాలు తినడం చాలా మంచిది. దీని వెనుక అనేక శాస్త్రీయ , ఆయుర్వేద కారణాలు దాగి ఉన్నాయి. లవంగం శ్వాసను తాజాగా ఉంచడంలో, జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గించడంలో కూడా లవంగాలు ఉపయోగపడతాయి. భోజనం తర్వాత లవంగాలు తినడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


భోజనం తర్వాత మౌత్ ఫ్రెషనర్లుగా అనేక పదార్థాలను తీసుకుంటారు. వాటిలో సోంపు, యాలకులు , లవంగాలు ప్రముఖమైనవి. ముఖ్యంగా లవంగాలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి కాబట్టి భోజనం తర్వాత వాటిని నమలడం మంచిది.

లవంగం ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు.. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం కూడా. ఇందులో యూజినాల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్‌తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి.


భోజనం తర్వాత లవంగాలు నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఇది ఆహారం వేగంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది.

తాజా శ్వాస కోసం:
లవంగాలు సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి నోటి నుండి బ్యాక్టీరియాను తొలగించి, శ్వాసకు తాజాదనాన్ని అందిస్తాయి. ఇది సహజమైన మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా నోటి దుర్వాసనను తొలగిస్తుంది.

పంటి నొప్పి నివారణ:
లవంగాలు తినడం వల్ల వీటిలో ఉండే యూజినాల్ పంటి నొప్పి, చిగుళ్ల వాపు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది దంత సమస్యలకు లవంగాల నూనె ఉపయోగపడుతుంది.

గొంతు నొప్పి, జలుబు:
లవంగాలలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గొంతు నొప్పి, దగ్గు, జలుబు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. శీతాకాలంలో లవంగాలు నమలడం వల్ల కఫం సులభంగా తొలగించబడుతుంది. అంతే కాకుండా ఇది గొంతుకు ఉపశమనం లభిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయి:
లవంగాలు తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని పలు పరిశోధనలు రుజువు చేశాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ పనితీరును పెంచే అంశాలను కలిగి ఉంటాయి. అంతే కాకుండా డయాబెటిక్ రోగులకు కూడా ప్రయోజనాలను అందిస్తాయి.

రోగనిరోధక శక్తి:
లవంగాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి ఉపయోగపడతాయి. ఫలితంగా వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

Also Read: నడక, వ్యాయామం బరువు తగ్గడానికి ఏది బెటర్ ?

ఎలా తినాలి ?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భోజనం తర్వాత 1-2 లవంగాలను నమలడం ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని నెమ్మదిగా నమలండి. తద్వారా దాని రసం నోటిలో బాగా కరిగి మరింత ప్రభావవంతంగా మారుతుంది.

లవంగం ఒక చిన్నది అయినా ఇది జీర్ణక్రియకు, శ్వాసను తాజాగా ఉంచడానికి, దంతాల రక్షణకు, గొంతు సమస్యలకు, రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది. వీటిని తరచుగా తినడం ద్వారా మీరు మొత్తం ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×