E-Paper
Advertisement

Siddhu Jonnalagadda: టిల్లు పాత్ర నుండి బయటికి వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ.. మొదటిసారి అలాంటి ప్రయోగం

Siddhu Jonnalagadda: టిల్లు పాత్ర నుండి బయటికి వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ.. మొదటిసారి అలాంటి ప్రయోగం
Advertisement

Siddhu Jonnalagadda: సినీ ప్రపంచం ఎవరికి ఎప్పుడు లక్ కలిసొచ్చేలా చేస్తుందో చాలా కష్టం. ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో హీరోలుగా నటిస్తున్నా కూడా గుర్తింపు రానివారు ఉన్నారు. అలాగే ఒక్క సినిమాతోనే ఫేట్ మారిపోయిన వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో ఉన్న చాలామంది యంగ్ హీరోలు.. లక్‌ను నమ్ముకోకుండా టాలెంట్‌ను నమ్ముకుంటూ ముందుకెళ్తున్నారు. అందులో ఒకడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ యంగ్ హీరో పేరు చెప్పినా గుర్తుపట్టని కొందరు ప్రేక్షకులు.. టిల్లు అనగానే వెంటనే గుర్తుపడతారు. టిల్లుగా ఆ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న ఇప్పుడు ఆ పాత్ర నుండి బయటికి వచ్చి ఒక కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు.

‘టిల్లు’కు బ్రేక్

Advertisement

సిద్ధు జొన్నలగడ్డ సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యి, హీరోగా మారి దాదాపు పదేళ్లు అవుతోంది. కానీ ‘డీజే టిల్లు’ అనే ఒక్క మూవీ తన కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. అప్పటినుండి ప్రేక్షకుల దృష్టిలో సిద్ధు పేరు టిల్లుగా మారిపోయింది. ఒక చిన్న బడ్జెట్ సినిమాగా తెరకెక్కి ఎన్నో వండర్స్ క్రియేట్ చేసింది ‘డీజే టిల్లు’. ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడం కోసమే దానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ను రంగంలోకి దింపాడు సిద్ధు. ఈ సీక్వెల్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి.. ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యింది. గత కొన్నేళ్లుగా ‘టిల్లు’ ఫ్రాంచైజ్‌లోనే బిజీగా ఉన్న సిద్ధు.. ఇప్పుడిప్పుడే ఆ క్యారెక్టర్ నుండి బయటికొస్తున్నాడు.

Also Read: 82 ఏళ్ల వ్యక్తితో జత కట్టిన 33 ఏళ్ల బ్యూటీ..!

Advertisement

హిట్ కాంబో

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డకు టాలీవుడ్‌లో పలువురు యంగ్ డైరెక్టర్లతో మంచి సాన్నిహిత్యం ఉంది. ముఖ్యంగా రవికాంత్ పేరేపుతో సిద్ధుకు చాలాకాలంగా మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘కృష్ణ అండ్ హిస్ లీల’ అనే యూత్‌ఫుల్ మూవీ వచ్చింది. అప్పట్లో ఈ సినిమా చాలామంది యూత్‌కు కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఈ హిట్ కాంబినేషన్ కలవనుంది. కానీ ఈసారి ‘కృష్ణ అండ్ హిస్ లీల’ లాంటి యూత్‌ఫుల్ సినిమా కోసం కాదు.. ‘కోహినూర్’ అనే కొత్త కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా కోసం. తాజాగా ‘కోహీనూర్’ మూవీ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కోసం సిద్ధు గుర్తుపట్టేనంతగా మారిపోయాడని పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతోంది.

రాజు తీసుకొస్తాడు

‘రాజే దానిని తిరిగి తీసుకొస్తాడు’ అనేది ‘కోహీనూర్’ సినిమా క్యాప్షన్. అంటే ఈ సినిమా కోహీనూర్ డైమండ్ చుట్టూ తిరుగుతుందా? లేదా ఈ టైటిల్ వెనుక మరొక అర్థం ఉందా అనేది క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. దసరా సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘టిల్లు’ ఫ్రాంచైజ్‌ను నిర్మించిన నాగవంశీ.. ‘కోహీనూర్’ను కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి ముందుకొచ్చారు. జనవరి 2026న ‘కోహీనూర్’ ఫస్ట్ పార్ట్ విడుదల కానుందని మేకర్స్ అప్పుడే క్లారిటీ ఇచ్చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా రెండు పార్ట్స్‌గా తెరకెక్కనుందని అర్థమవుతోంది. ‘కోహీనూర్’తో పాటు ‘తెలుసు కదా’ లాంటి లవ్ స్టోరీ కూడా సిద్ధు ఖాతాలో ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×