BigTV English

Pooja Hegde:82 ఏళ్ల వ్యక్తితో జత కట్టిన 33 ఏళ్ల బ్యూటీ..!

Pooja Hegde:82 ఏళ్ల వ్యక్తితో జత కట్టిన 33 ఏళ్ల బ్యూటీ..!

Tollywood Heroine.. ఈ మధ్యకాలంలో సినిమాలలో హీరో , హీరోయిన్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతలా ఉంటుందో అందరికీ తెలిసిందే. హీరోయిన్లు కూడా ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అంటూ కామెంట్లు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా అయినా సీరియల్ అయినా యాడ్ అయినా ఇంకేదైనా.. వయసుతో సంబంధం లేకుండా వచ్చిన పాత్రకు న్యాయం చేయడమే తమ లక్ష్యం అన్నట్టు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే 82 ఏళ్ల పెద్దాయనతో 33 ఏళ్ల అమ్మాయి జతకట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది.


82 ఏళ్ల వ్యక్తితో 33 ఏళ్ల అమ్మాయి..

అసలు విషయంలోకెళితే అతడి వయసు 82 కానీ మనసు 22.. ఆమె వయసు 33 కానీ ఆమె మనసు 16.. ఇప్పుడు ఆ ఇద్దరూ చేతక్ స్కూటర్ పై అలా సరదాగా కలిసి ప్రయాణం చేశారు. ఇది ప్రకటన కోసం అయి ఉండచ్చేమో.. అయినా ఆ ఇద్దరిని అలా చూడగానే తాతయ్యతో మనవరాలి జ్ఞాపకాలు అంటూ నెటిజన్స్ సైతం ఈ ఫోటో చూసి కామెంట్లు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించడానికి అవకాశం ఇచ్చినందుకు పూజా ఆనందానికి అవధులు లేవనడంలో సందేహం లేదు. ఇప్పటికే వారిద్దరూ కలిసి నటించిన వాణిజ్య ప్రకటన టీవీలలో ప్రసారం అవుతూనే ఉంది.


అమితాబ్ బచ్చన్ కి స్పెషల్ విషెస్..

ఇదిలా ఉండగా అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా పూజా హెగ్డే షేర్ చేసిన ఒక ఫోటో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా లెజెండ్ అమితాబ్ బచ్చన్ సినిమాలు చూస్తూ పెరిగానని ఎమోషనల్ నోట్ కూడా వదిలింది ఈ ముద్దుగుమ్మ. మరి పూజ వదిలిన ఆ నోట్ సారాంశం ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఎమోషనల్ నోట్ వదిలిన పూజా హెగ్డే.

ఈ నేషనల్ ట్రెజర్ కి జన్మదిన శుభాకాంక్షలు. లివింగ్ లెజెండ్ ఎప్పటికీ విస్మయం కలిగిస్తూనే ఉంటారు. ఆయన సినిమాలు చూస్తూనే నేను పెరిగాను. ఇప్పటికీ ఆయనతో స్క్రీన్ స్పేస్ ను షేర్ చేసుకుంటూ ఉండడం నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఆయన ఒకే ఒక్కరు అమితాబ్ బచ్చన్ అంటూ ఆయన పై ప్రశంసలు కురిపించింది. అంతే కాదు మ్యాంగో జ్యూస్ యాడ్ చేసిన వీరిద్దరూ అందుకు సంబంధించిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పోస్ట్ పెట్టింది పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మాధ్యమాలలో వైరల్ గా మారుతోంది.

పూజా హెగ్డే కెరియర్..

పూజా హెగ్డే టాలీవుడ్ జర్నీ అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరితో కూడా జతకట్టింది. అయితే ఆ మధ్యకాలంలో వరుస పరాజయాలు ఈమెను ఇబ్బంది పెట్టినా .. ఆ తర్వాత మళ్లీ రేస్ లోకి వచ్చింది. ఇటీవలే ఎన్నో ఆఫర్లు తలుపు తట్టాయి. కానీ పారితోషకం విషయంలో మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఆ అవకాశాలు కాస్త అలాగే వెనక్కి వెళ్ళిపోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దర్శకులు కూడా పూజా కు ప్రత్యామ్నాయంగా ఇంకొకరిని వెతుకుతున్నారు. ముఖ్యంగా తన వద్ద చేసే ఉద్యోగుల పరిహారం, ఫైవ్ స్టార్ హోటల్లో వసతి ఇతర ప్రయోజనాల గురించి నిర్మాతలను డిమాండ్ చేయడం వల్లే ఆమెను సినిమాలలో తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఇలాంటివి తగ్గించుకొని మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెడితే అవకాశాలు వస్తాయని చెప్పడంలో సందేహం లేదు.

 

View this post on Instagram

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×