BigTV English

Siddu Jonnalagadda: ఇద్దరు హీరోయిన్లతో సిద్ధు జొన్నలగడ్డ కొత్త మూవీ..షూటింగ్ షురూ!

Siddu Jonnalagadda: ఇద్దరు హీరోయిన్లతో సిద్ధు జొన్నలగడ్డ కొత్త మూవీ..షూటింగ్ షురూ!

Siddu Jonnalagadda New Movie(Latest news in tollywood): టిల్లు స్వ్కేర్ సెన్సెషనల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ప్రముఖ నిర్మాత కోనా వెంకట్ సోదరి స్టైలిస్ నీరజ కోనా కాంబినేషన్ లో కొత్త మూవీ రానుంది. ఇందులో భాగంగానే తన తదుపరి ప్రాజెక్టు ‘తెలుసు కదా’తో ప్రేక్షకులను అలరించనున్నారు. నీరజ కోనా, సిద్దు స్టార్ డమ్ ను దృష్టిలో ఉంచుకుని పర్ఫెక్ట్ స్క్రిఫ్ట్ ను సిద్దం చేశారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. రాశీ ఖన్నాతో పాటు కేజీఎఫ్ శ్రీనిధి శెట్టి కనిపించనున్నారు.


ఈ సినిమాను టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాలను నిర్మించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల తెరకెక్కిస్తున్నారు. తాజాగా, ‘తెలుసు కదా’ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. దాదాపు 30 రోజుల పాటు నిరంతరంగా సాగే షెడ్యూల్ అని మేకర్స్ తెలిపారు. ఇందులో టాకీ సీన్స్, మ్యూజిక్ నంబర్స్ షూట్ ఉండనున్నాయి.

అయితే, మొదటి రోజు హీరోయిన్ రాశీ ఖన్నా..సిద్దుతో కలిసి షూటింగ్ లో పాల్గొనింది. అలాగే మరో హీరోయిన్ కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి తెలుగులో ఎంట్రీ ఇవ్వనుండగా.. వైవా హర్ష ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. తొలుత ఈ మూవీ లీడ్ రోల్ కోసం నితిన్ ను సంప్రదించగా..సిద్దు అయితు క్యారెక్టర్ కు న్యాయం చేస్తాడని భావించి ఈ ప్రాజెక్టు సిద్దుకు వెళ్లినట్లు సమాచారం.


Also Read: నివేథా థామ‌స్ సినిమా వాయిదా.. వారి వల్లనేనా.. ?

ఇదిలా ఉండగా, సిద్దు జొన్నలగడ్డ తన పాత్ర కోసం స్టైలిష్ మేకోవర్ కావడం, ఇంటెన్స్ ప్రీ ప్రొడక్షన్ మూవీ గ్రాండ్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ సూచిస్తుంది. ఇక ఈ సినిమాను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే ఇందులో టాప్ టెక్నీషియన్లు పనిచేస్తుండగా..తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేస్తుండగా.. నేషన్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్ గా, బిజీ ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్, కాస్ట్యూమ్స్ డిజైన్ గా శీతల్ శర్మ చేస్తున్నారు.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×