Big Stories

Tillu Square First Review: టిల్లు స్క్వేర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది భయ్యా.. సినిమా ఎలా ఉండబోతుందంటే?

tillu square
tillu square

Tillu Square First Review: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటిస్తోన్న కొత్త సినిమా ‘టిల్లు స్క్వేర్’. ఈ మూవీలో సిద్ధుకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ గతంలో రిలీజ్ అయి భారీ హిట్‌ను అందుకుంది. అందువల్ల ఇప్పుడు ఈ సీక్వెల్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలను పెంచేశాయి. అంతేకాకుండా ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‌ సినీ ప్రియుల్ని మరోలోకానికి తీసుకెల్లిందనే చెప్పాలి. అలా ఉంది మరి ట్రైలర్. అందులో ముద్దు సీన్లు, హగ్గ్ సీన్లు అబ్బబ్బో.. రెండు మూడు నిమిషాలకే ఇంత ఘాటు రొమాన్స్ ఉంటే ఏకంగా రెండున్నర గంటల సినిమాలో ఇంకెన్ని సీన్లు ఉంటాయో అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.

- Advertisement -

ఈ ట్రైలర్‌లో సిద్ధుగాని డైలాగ్ డెలివరి, స్వాగ్, డ్యాన్స్ ఓ రేంజ్‌లో ఉంటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ సినిమా మార్చి 29న అంటే రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. తాజాగా ఈ మూవీ హీరో సిద్దూ జొన్నలగడ్డ తన సినిమాకి తానే ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు.

Also Read: సెట్స్ అంట భయ్యా.. నువ్వు అనుకున్నది కాదు

తాజాగా యాంకర్ సుమతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ మూవీ నిర్మాత నాగవంశీ, సిద్దు, అనుపమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇదే ఇంటర్వ్యూలో టిల్లు స్క్వేర్ మూవీ గురించి సిద్దూ రివ్యూ ఇచ్చాడు. ఈ సినిమాకి అద్భుతమైన స్టోరీ ఉంటుందని అన్నాడు. అలాగే ఈ చిత్రానికి ముఖ్యమైనది కామెడీ అని.. ఫస్ట్ హాఫ్ మొత్తం కడుపుబ్బా నవ్వుకుంటారు అని అన్నాడు.

అలాగే ఫస్ట్ హాఫ్ ఎంతలా ఎంటర్‌టైన్ చేస్తుందో.. సెకండాఫ్ కూడా అంతే ఎంటర్‌టైన్ చేస్తుందని తెలిపాడు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్‌ సీన్స్ అయితే ఎవరూ ఊహించని విధంగా.. చాలా క్రేజీగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. అలాగే ప్రీ క్లైమాక్స్‌లో ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఉంటుందని.. దానిని ఎవరూ ఊహించుకోలేరని పేర్కొన్నాడు.

గతం కంటే ఈ సారి మరింత ఎనర్జిటిక్‌గా.. సాలిడ్ ఎలిమెంట్స్‌తో వస్తున్నామని.. ఖచ్చితంగా హిట్టుకొడతామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సిద్దూ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. ఈ మూవీ రిలీజ్ ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేయనున్నారు.

Also Read: సినిమాలకు బాలయ్య బ్రేక్.. ?

ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్‌ను ప్రకటించారు. అప్పటి నుంచి సీక్వెల్‌లో సిద్దూ, రాధిక కెమిస్ట్రీ మరో రేంజ్‌లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ రాధిక ప్లేస్‌లో మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరిని మేకర్స్ తీసుకున్నారు. దీంతో చాలా మంది ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు. ఈ సినిమాకి రాధిక అయితేనే బాగుంటుందంటూ ఆ మధ్య కామెంట్ల వర్షం కురిపించారు. రాధిక ప్లేస్‌లో అనుపమను ఊహించుకోలేమంటూ సినీ ప్రియులు బాధపడ్డారు.

కానీ టిల్లూ స్క్వేర్ నుంచి ఒక్కొక్కటిగా రిలీజ్ అయిన అప్డేట్‌లతో సినీ ప్రియుల్లో ఫుల్ జోష్ పెరిగింది. ఇక ఈ సీక్వెల్ చిత్రానికి కూడా రామ్ మిర్యాల సంగీతం అందిస్తుండటంతో సినిమా హిట్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. మొదటి నుంచి ఈ మూవీ నుంచి కలర్ ఫుల్ పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ అంచనాలను పెంచేశారు. మొదటిగా టికట్టే కొనకుండా అంటూ సాగే ఓ సాంగ్‌ను రిలీజ్ చేసి ప్రేక్షకాభిమానుల్లో ఫుల్ ఊపు తెప్పించారు. ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసి అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకుంది మూవీ యూనిట్.

ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో చేరుకున్నాయి. టిల్లు మూవీలో రాధికనే బోల్డ్ అనుకుంటే.. ఆమెకంటే అనుపమ మరీ బోల్డ్‌గా చేసి కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. కారులో కిస్ సీన్లతో చంపేసింది. ఇక సినిమా మొత్తంలో ఇంకెన్ని సీన్లు ఉంటాయో అని అంతా అనుకుంటున్నారు. అలాగే ‘నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే’ అనే సాంగ్ అయితే ఇక చెప్పాల్సిన పనేలేదు. రామ్ మిర్యాల పాడిన ఈ పాటకు థియేటర్ దద్దరిల్లిపోవడం ఖాయమనే అనిపిస్తుంది. మొత్తంగా ఈ ట్రైలర్‌ ప్రకారం.. సినిమాలో అద్భుతమైన కామెడీ, కళ్లుచెదిరే బోల్డ్ సీన్స్ యువతను థియేటర్‌కు పరుగులు పెట్టిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News