Big Stories

ED Focus On Punjab CM: పంజాబ్‌పై ఈడీ ఫోకస్.. సీఎంకు చెక్ పెడతారా?

panjab
 

ED Focus On Punjab CM: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కింగ్‌పిన్ అనుకుంటున్న కవిత తీహార్ జైల్లో సెటిల్ అయ్యారు. ఇది జస్ట్‌ ఇన్ఫో మాత్రమే.. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఇష్యూ ఇది కాదు. కవిత అండ్‌ కో పంపిన డబ్బు మూటలను..కేజ్రీవాల్ ఏం చేశారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఈడీ నెక్ట్స్‌ ఫోకస్‌ చేసేది పంజాబ్‌ పైనేనా? ఇప్పుడు ఈడీ లాగే తీగ.. పంజాబ్‌లో డొంకను కదిలించనుందా? అంతేకాదు జైలు నుంచే పాలిస్తానంటున్న కేజ్రీవాల్ కల నెరవేరుతుందా? లేదా కలగానే మిగిలిపోనుందా?

- Advertisement -

వరుసగా సమన్లు.. ఆ తర్వాత సోదాలు.. విచారణలు.. విశ్లేషణలు.. ఇలా అన్నీ చేసిన తర్వాత ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కింగ్‌పిన్‌గా భావిస్తున్న.. అరవింద్‌ కేజ్రీవాల్‌, కవితను అరెస్ట్ చేసింది ఈడీ.. అయితే ఈ కేసుకు ఎండ్‌ కార్డ్‌ పడినట్టేనా? ఈ క్వశ్చన్‌కు నో అనే ఆన్సర్ చెబుతోంది ఈడీ.. ఇప్పుడు ఈడీ ఫోకస్‌ పంజాబ్‌ పెట్టింది. పంజాబ్‌ లిక్కర్‌ పాలసీపై నజర్ పెట్టింది. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్‌ మాన్‌ నిర్ణయాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పంజాబ్‌ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్‌ కమిషనర్ వరుణ్‌ రూజమ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించింది.

- Advertisement -

Also Read: వారే మెట్టు దిగారు.. వీరెందుకిలా? ఏపీ బీజేపీ నేతల తీరు మారదా?

ఈడీ పంజాబ్‌పై ఎందుకు ఫోకస్ చేసింది.. ? ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు, పంజాబ్‌కు ఏమైనా లింక్‌ ఉందా? అంటే ఔననే అంటున్నారు పంజాబ్‌ బీజేపీ స్టేట్ చీఫ్‌ సునీల్‌ కుమార్.. ఆయన ఇప్పటికే ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాకు కంప్లైంట్ చేశారు.. ఢిల్లీ లిక్కర్‌ పాలసీలాగానే.. పంజాబ్‌ లిక్కర్‌ పాలసీలో కూడా లొసుగులు ఉన్నాయి. దీనిపై కూడా దర్యాప్తు చేయండి.. అసలు నిజాలు వెలుగులోకి తీసుకురండి. ఇది ఆయన కోరింది. ఆయన ఈ ఫిర్యాదు చేసిన సమయంలో ఈడీ రంగంలోకి దిగింది. ఆయన ఇంట్లో సోదాలు చేసింది. ఆయన మాత్రమే కాదు. ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లోని కొందరు వ్యక్తులకు కూడా త్వరలోనే ఈడీ నోటీసులు వెళ్లనున్నాయి. వాళ్లందరిని ఢిల్లీకి పిలిపించి విచారించాలన్న ఆలోచనలో ఉంది ఈడీ..

ఇప్పటికే ఈ కేసులో లంచంగా ముట్టిన డబ్బులను.. గోవా, పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి వాడారని ఈడీ చెబుతోంది. లెక్కలు కూడా చూపెడుతోంది. మరి ఇప్పుడు ఈడీ కనుక పంజాబ్‌పై ఫోకస్‌ చేస్తే..
ఎవరి పేర్లు బయటికి వస్తాయి? ఎవరిపై కేసులు నమోదవుతాయి? ఎన్నికల ముందు ఆప్‌ నేత, పంజాబ్‌ సీఎం భగవంత్ సింగ్‌ మాన్‌ చిక్కుల్లో పడటం తప్పదా? అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది..

పంజాబ్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి ఒంటరిగా పోటీ చేయాలని డిసైడ్‌ అయ్యింది బీజేపీ.. 13 లోక్‌సభ స్థానాల్లో సొంతంగా అభ్యర్థులను బరిలోకి దించనుంది. ఇలాంటి సమయంలో పంజాబ్‌పై ఈడీ ఫోకస్ చేయడం కాస్త ఇంట్రెస్టింగ్‌ అనే చెప్పాలి.. ఈడీ మరికొన్ని రోజుల్లో కనుక నోటీసులు జారీ చేసి విచారణ జరిపితే.బీజేపీ ఎన్నికల అస్త్రం పంజాబ్ లిక్కర్‌ పాలసీ కావడం తథ్యం.

ఇది పంజాబ్ స్టోరీ.. ఇప్పుడు ఢిల్లీకి వద్దాం.. కేజ్రీవాల్ అరెస్టైనప్పటి నుంచి ఒక మాట వినిపిస్తోంది. అదేంటంటే ఢిల్లీ నుంచే కేజ్రీవాల్‌ పాలిస్తారని.. మరి కేజ్రీవాల్ కల నెరవేరుతుందా? అంటే అంత కాన్ఫిడెంట్‌గా యస్‌ చెప్పే సినారియో కనిపిచండం లేదు. ఎందుకంటే ఢిల్లీ పాలిటిక్స్‌పై ఫోకస్‌ పెంచారు అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్.. సర్కార్‌ జైల్‌ సే నహీ చలేగీ అంటున్నారు ఢిల్లీ ఎల్‌జీ వీకే సక్సెనా.. ఢిల్లీ ప్రజలకు నేను నమ్మకం ఇస్తున్నా.. ప్రజల ప్రభుత్వం జైలు నుంచి మాత్రం నడవదు..అని బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే కేజ్రీవాల్‌ కల నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు..
నిజానికి గురువారంతో కేజ్రీవాల్ కస్టడీ ముగియనుంది. కానీ ఆయనకు బెయిల్ వచ్చే చాన్సేస్‌ అయితే చాలా తక్కువ.. సో ఆయన కూడా కవిత బాటలోనే తీహార్‌కు వెళ్లక తప్పని పరిస్థితి.. ఇదే జరిగితే వెంటనే రంగంలోకి దిగేందుకు రెడీగా ఉన్నారు సక్సెనా..

Also Read: కాదు కాదంటూనే కాపు ఓట్ల కోసం.. పవన్ దారి.. ఉభయ గోదావరి..!

టెక్నికల్‌గా చూస్తే రాజ్యాంగం ప్రకారం.. ప్రస్తుతం నేరం నిరూపించే వరకు కేజ్రీవాల్‌ను నేరస్థుడిగా పరిగణించలేం.. కాబట్టి ఆయన చేతి నుంచి పాలన పగ్గాలు వెళ్లే పరిస్థితి లేదు. నైతికంగా ఆయనంత ఆయన రాజీనామా చేస్తే తప్ప.. టెక్నికల్‌గా ఆయన నుంచి అధికారాన్ని లాక్కోనే పరిస్థితి లేదు. ఒకవేళ ఎల్జీ ఏవైనా చర్యలు తీసుకుంటే. మళ్లీ ఈ పంచాయితీ రాజ్యాంగ ధర్మాసనానికి చేరుకోవడం పక్కా…

ఓ వైపు ఈ పంచాయితీ నడుస్తుంటేనే.. మరో బాంబు పేల్చారు కేజ్రీవాల్ సతీమణి సునీతా.. రౌజ్‌ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ సంచలన విషయాలను చెప్పబోతున్నారు..
ఈడీ చెబుతున్న డబ్బు ఎక్కడుందో కోర్టులోనే కేజ్రీవాల్ బయటపెడతారంటూ బాంబ్ పేల్చారు సునీత.. ఇప్పటి వరకు తమ ఇంట్లో ఎన్నో సార్లు సోదాలు చేసినా.. కేవలం 73 వేల కంటే ఎక్కువ నగదును స్వాధీనం చేసుకోలేకపోయారు..
ఇదీ ఆమె చెప్తున్న విషయాలు..

మరి పంజాబ్‌పై ఈడీ ఫోకస్ చేస్తే ఏం జరగబోతుంది? కోర్టులో కేజ్రీవాల్‌కు బెయిల్‌ దొరకుతుందా? లేదా? ఆయన తీహార్‌ జైలుకు తప్పదా? ఇంతకీ కేజ్రీవాల్‌ కోర్టులో చెప్పబోయే ఆ సంచలన విషయాలేంటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఏదేమైనా ఈ కేసు మరో టర్న్‌ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అది ఆప్‌ను ఊరట కల్పిస్తుందా? మరింత ఇరుకున పెడుతుందా? అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News