BigTV English

Salman Khan: సెంచరీ కొట్టని సూపర్ స్టార్…

Salman Khan: సెంచరీ కొట్టని సూపర్ స్టార్…

Salman Khan: సల్మాన్ ఖాన్ సినిమాలు సాధారణంగా భారీ ఓపెనింగ్స్ సాధించడం, మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోవడం సర్వ సాధారణం. కానీ, ఈద్ కానుకగా విడుదలైన ‘సికందర్’ మాత్రం ఆ స్థాయికి చేరకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తొలి మూడు రోజుల్లో ₹74.5 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించడం, మరికొన్ని రోజుల్లో కూడా వంద కోట్ల క్లబ్‌లో చేరడం కష్టమని సినీ వర్గాలు అంచనా వేస్తుండటం, ఇది సల్మాన్ స్టామినాపై కామెంట్స్ కి కారణం అయ్యింది.


ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ కథల ఎంపికపై పెరుగుతున్న విమర్శలు మరోసారి హైలైట్ అవుతున్నాయి. ఆయన సినిమాలు స్టోరీల పరంగా కొత్తదనం చూపించకపోవడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతోందనే అభిప్రాయం ఉంది. ఇదే కారణంగా ‘సికందర్’ విడుదలైన తొలి రోజే ఫ్లాప్ టాక్ రావడం, టాక్ పాజిటివ్ లేకపోవడం, రెండో రోజు నుంచే కలెక్షన్లు పడిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. మాస్ ప్రేక్షకులు అభిమానంతో మొదటి రోజు థియేటర్లకు వచ్చి చూస్తారేమో గానీ, సినిమా కంటెంట్ ఆకట్టుకోకపోతే మౌత్ టాక్ బలంగా లేకపోవడం వసూళ్లను దెబ్బ తీస్తుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు ‘సికందర్’ విషయంలోనూ జరిగింది.

సినిమా ఓపెనింగ్స్ అయితే ఓ మాదిరిగా వచ్చాయి కానీ, రెండో రోజే కలెక్షన్లు తగ్గిపోవడం పెద్ద హెచ్చరిక. సల్మాన్ ఖాన్ స్టార్డమ్ పరంగా చూస్తే, సినిమా టాక్ ఎలా ఉన్నా మూడు రోజుల్లో వంద కోట్ల మార్క్‌ను దాటడం సాధారణంగా జరిగే విషయం. కానీ, ఈసారి ఆ మ్యాజిక్ లేకపోవడంతో “కేవలం స్టార్ పవర్‌కి మాత్రమే సినిమాలు నడిచే రోజులు అయిపోయాయా?” అనే చర్చ మొదలైంది.


గతంలో సల్మాన్ నటించిన కొన్ని సినిమాలు తీవ్రంగా విఫలమైనా, ఆ సమయంలో కరోనా ప్రభావం వల్ల కలెక్షన్స్ లో ఇంపాక్ట్ ఉందని ట్రేడ్ వర్గాలు భావించాయి. టైగర్ 3 సినిమా ఫ్లాప్ అయినా కూడా మూడు వందల కోట్ల మార్క్ ని చేరింది కానీ ఇప్పుడు ‘సికందర్’ ఓపెనింగ్స్ పరంగా నిరాశపరిచేలా ఉండటంతో, సల్మాన్ ఖాన్ మార్కెట్ రిస్క్ లో పడింది.

ప్రస్తుత పరిస్థితిలో సల్మాన్ ఖాన్ తన కథల ఎంపికలో మార్పు చేయడం తప్పనిసరి. ఫ్రెష్ కంటెంట్‌తో, తన పాత్రకు బలమైన ఎమోషన్స్ ఇచ్చే కథల్ని ఎంచుకోవడం అవసరం. కేవలం తన స్టార్డమ్‌ను నమ్ముకుని రొటీన్ మాస్ సినిమాలతో వెళ్లిపోతే, రానున్న రోజుల్లో అభిమానులు కూడా థియేటర్లకు రావడం తగ్గించే అవకాశం ఉంది. మంచి దర్శకులతో, ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథాంశాలతో సినిమాలు చేయకపోతే, మున్ముందు సల్మాన్ ఖాన్ సినిమాలకు ఓపెనింగ్స్ కూడా రావడం కష్టమవుతుంది. ‘సికందర్’ బాక్సాఫీస్ డౌన్‌ఫాల్ సల్మాన్ ఖాన్ కి పెద్ద హెచ్చరిక, అది ఇంకా ఎక్కువ అవ్వక మారకముందే, సల్మాన్ ఖాన్ తన కథల ఎంపికను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×