PBKS VS LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ తమ జోరును కొనసాగిస్తోంది. వరుసగా రెండవ మ్యాచ్ లోను విజయం సాధించింది పంజాబ్. మంగళవారం రోజు లక్నోలోని ఎకాన స్టేడియంలో ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ని చిత్తు చేసింది. ముందుగా బౌలింగ్ లో నిప్పులు చెరిగిన పంజాబ్.. ఆ తరువాత విధ్వంసకర బ్యాటింగ్ తో లక్నో కి ఊహించని షాక్ ఇచ్చింది.
Also Read: Ashwani Kumar: ఆటో ఛార్జీకి రూ.30 అడిగేవాడు.. కానీ ఇప్పుడు ముంబైని ఏలుతున్నాడు !
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్నీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. నీకోలాస్ పురాన్ {44}, ఆయుష్ బదోని {41} పరుగులతో రాణించగా.. అబ్దుల్ సమాద్ {27} మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో లక్నో 171 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 2, లాకీ ఫెర్గుసన్, గ్లేన్ మాక్స్ వెల్, మార్కో జాన్సన్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది.
పంజాబ్ బ్యాటర్లలో.. ప్రియాన్ష్ ఆర్య {8}, వికెట్ కీపర్ ప్రబ్ సిమ్రాన్ సింగ్ {69}, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ {52*}, నెహాల్ వధేర {43*} మెరుపులు మెరిపించడంతో పంజాబ్ సునాయాసంగా విజయాన్ని అందుకుంది. లక్నో బౌలర్లలో దిగ్వేష్ రతి 2 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీకి చెందిన ఇద్దరు ప్లేయర్ల మధ్య {PBKS VS LSG} హీట్ వెదర్ కనిపించింది. ఢిల్లీకి చెందిన ప్రియాంష్ ఆర్య, దిగ్వేశ్ రతి మధ్య జరిగిన ఈ వివాదం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
లక్నో సూపర్ జెయింట్స్ లెగ్ స్పిన్నర్ దిగ్వేష్ మూడవ ఓవర్ లో ప్రియాంష్ ఆర్యను అవుట్ చేసిన అనంతరం విచిత్రంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వేడుక చూస్తే విరాట్ కోహ్లీ, కేస్రిన్ విలియమ్స్ మధ్య జరిగిన సీన్ గుర్తుకు వచ్చింది. ఇంతకీ వీరి మధ్య ఏం జరిగిందంటే.. దిగ్వేష్ తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రియాంష్ ఆర్య ని ట్రాప్ చేశాడు. ప్రియాంష్ భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. కానీ బంతి గాల్లోకి లేవడంతో శార్దూల్ ఠాకూర్ ఈజీ క్యాచ్ పట్టుకున్నాడు.
ఆ తరువాత దిగ్వేష తన సహచరులతో సెలబ్రేషన్ చేసుకోకుండా.. ప్రియాన్ష్ వైపు పరిగెత్తి తన చేతిలో ఏదో రాస్తున్నట్టుగా చేసి హీట్ పెంచాడు. కానీ ప్రియాంష్ అతడికి సమాధానం ఇవ్వకుండా ముందుకు సాగాడు. దిగ్వేష్ ఇలా ఎందుకు చేశాడో తెలియదు కానీ.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ సమయం నుండి ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ గా మారిన ఈ వీడియోని చూసిన నెటిజెన్లు.. లక్నో బౌలర్ ఓవరాక్షన్ చేస్తే.. పంజాబ్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసిందని కామెంట్స్ చేస్తున్నారు.