BigTV English

JR NTR: ‘దేవర ‘పార్ట్‌ 2.. సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్..?

JR NTR: ‘దేవర ‘పార్ట్‌ 2.. సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్..?

JR NTR: టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం దేవర.. ఈ మూవీ సెప్టెంబర్ 27 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మొదట్లో మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా ఆ తర్వాత మెల్ల మెల్లగా టాక్ తో పాటుగా కలెక్షన్స్ కూడా మారాయి.. ఇప్పటికే ఈసినిమా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి బ్రేక్ ఈవెన్ కూడా అయింది. ఇక మొదటి పార్ట్ సక్సెస్ ను అందుకున్న నేపథ్యంలో సెకండ్ పార్ట్ పై ఆసక్తి పెరిగింది. ఈ మూవీ గురించి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ పై ఎన్టీఆర్ టాప్ సీక్రెట్ ను రీవిల్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఓ రేంజులో వైరల్ అవుతుంది.


ప్రస్తుతం దేవర సినిమా 500 కోట్ల టార్గెట్ గా దూసుకుపోతోంది. అయితే దేవరకు వీకెండ్ తో పాటు దసరా హాలిడేస్ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉండటంతో.. 500 కోట్ల మార్క్ ను త్వరలోనే కంప్లిట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈక్రమంలో దేవర మూవీ టీమ్ రీసెంట్ గా సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీలో టాలీవుడ్ లోకి ప్రముఖులు నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువ సుధా ఆర్ట్స్‌ బ్యానర్ల పై  నందమూరి కళ్యాణ్ రామ్ , మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ 350 కోట్లకు పైగా అయ్యిందని సమాచారం.. ఓటీటీ రైట్స్ కూడా 155 కోట్లకు పైగా అమ్మడు పోయినట్లు సమాచారం.

ఈ మూవీ సక్సెస్ అయిన తర్వాత బియాండ్ ఫెస్ట్ లో పాల్గొనడం, అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేసారు. హాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 గురించి, కొరటాల శివ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.. దేవర పార్ట్ 2 వెంటనే చేస్తారా..? దాని సంబంధింన విషయాల గురించి అడిగినప్పుడు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర రిజల్ట్ బాగుంది, అందుకే పార్ట్ 2 కూడా బాగా ప్లాన్ చేశాము.. ఇప్పటికే కథ కూడా కంప్లీట్ వెర్షన్ సిద్దమైపోయింది. ఈ మూవీలో ఓ రెండు మేజర్ సీన్స్ కూడా షూటింగ్ అయిపోయిందని అన్నారు.. ఈ వార్తలు విన్న నెటిజన్లు సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ మూవీని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు..


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×