BigTV English

Silk Smitha Birthday : సినీ ఇండస్ట్రీ సిల్క్ బ్యూటీ.. బర్త్డే స్పెషల్..

Silk Smitha Birthday : సినీ ఇండస్ట్రీ సిల్క్ బ్యూటీ.. బర్త్డే స్పెషల్..
Silk Smitha

Silk Smitha Birthday : సిల్క్ స్మిత.. ప్రస్తుతం వాళ్లకి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సిల్క్ స్మిత లేని మూవీ ఉండేది కాదు అంటే అతిశయోక్తి కాదు. చాలా సినిమాలు హీరో కంటే కూడా సిల్క్ ని చూడడానికే వచ్చినవి ఉన్నాయి. అందం.. అభినయం.. ఆకట్టుకునే రూపం దేవుడు ఆమెకి ఇచ్చిన వరం. అయితే.. ఆమె జీవితం అనుకోని మలుపుల పడవ ప్రయాణం గా మారడంతో.. తీరాలను చేరకుండానే ఆమె ప్రయాణ ముగిసిపోయింది.


సిల్క్ స్మిత తెలుగు తో పాటుగా తమిళ్ ,కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించి అందరినీ మెప్పించింది. సుమారు 200 కు పైగా సినిమాలలో సిల్క్ తన అందాలతో కుర్రకారును రెచ్చగొట్టింది. సినిమాలలో బోల్డ్ క్యారెక్టర్స్ లో ఇచ్చినప్పటికీ వాస్తవానికి సిల్క్ స్మిత చాలా మితభాషి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు. ఓ నిరుపేద కుటుంబంలో విజయలక్ష్మి గా జన్మించిన సిల్క్ స్మిత నాలుగవ తరగతి తర్వాత పాఠశాలకు కూడా వెళ్లలేకపోయింది.

కుటుంబ పరిస్థితుల రీత్యా సినీనటిగా ఎదగాలి అని నిర్ణయించుకొని మద్రాసులోని తన అత్త ఇంటికి చేరుకుంది. ఆమె మొదటి చిత్రం వండి చక్రం అనే తమిళ్ మూవీ. స్క్రీన్ నేమ్స్ స్మితగా మార్చుకోవడం.. మొదటి మూవీలో ఆమె నటించిన పాత్ర పేరు సిల్క్ కావడంతో.. ఆమెకు సిల్క్ స్మితగా గుర్తింపు వచ్చింది. ప్రజల్లో కూడా ఈ పేరుకి మంచి క్రేజ్ రావడంతో ఆమె తన పేరును సిల్క్ స్మితగానే మార్చుకుంది.


సిల్క్ స్మిత నటన అద్భుతంగా ఉంటుంది.. మంచి యాక్టర్ అయ్యే స్కోప్ ఉన్నా.. ఆమె చాలావరకు సినిమాలలో ప్రత్యేక గీతాలు.. శృంగారం నృత్యాలకు.. వ్యాంప్ పాత్రలకు పరిమితమైంది. అప్పట్లో ఆమె తెలుగులో చేసిన బావలు సయ్యా.. మరదలు సయ్యా పాట.. యావత్ రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపింది. అప్పట్లో ఎక్కువగా ఆమె అలాంటి పాత్రలే చేస్తూ వచ్చేది.. అయితే 1991 లో వచ్చిన సీతాకోకచిలుక మూవీలో శరత్ బాబు భార్యగా ఆమె నటన మొదటిసారి ప్రేక్షకులను కదిలించింది. సిల్క్ స్మిత ఇంత బాధ్యత అయినా పాత్రను అంత అద్భుతంగా చేయగలదా అని అందరూ ఆశ్చర్యపోయారు.

సిల్క్ స్మిత కెరియర్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో.. ప్రేమ విషయంలో కూడా వైఫల్యాలను చవిచూసింది. అప్పట్లో సినీ ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బును తిరిగి అదే ఇండస్ట్రీలో నిర్మాతగా రాణించడానికి ప్రయత్నించి నష్టాల పాలయ్యింది అని టాక్. దీనికి తోడు వ్యసనాలకు బానిసైన ఆమె క్రమంగా డిప్రెషన్ లోకి వెళ్లి ఉంటుందని అంచనా. ఈనాటికి సిల్క్ స్మిత మరణం వెనక అసలు కారణం ఎవరికీ తెలియదు. కానీ ఇప్పటికీ ఎప్పటికీ అందరి దృష్టిలో ఆమెది కేవలం ఆత్మహత్య మాత్రమే. 1996 సెప్టెంబర్ 23న చెన్నైలో ఉన్న ఆమె అపార్ట్మెంట్లో సిల్క్ స్మిత చనిపోయింది.

కళ్ళతో మత్తెక్కిస్తూ.. అందమైన చిరునవ్వుతో పలకరిస్తూ.. తన పాటలతో.. డాన్స్ తో ..ఎందరినో ఎంటర్టైన్ చేసిన సిల్క్ కు బిగ్ టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×