BigTV English

scholarships : అందరికీ అందుబాటులో.. ఆస్ట్రేలియా చదువులు

scholarships  : అందరికీ అందుబాటులో.. ఆస్ట్రేలియా చదువులు

scholarships : విదేశాల్లో చదువుకుని.. మంచి ఉద్యోగాలు సాధించడం అనేది చాలామంది విద్యార్థుల కల. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలు, విభిన్న సంస్కృతులు ఉన్న ఆస్ట్రేలియాలో చదవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ.. ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు చాలా స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి చాలామందికి తెలియదు. ఆ స్కాలర్‌షిప్‌ల వివరాలేంటో చూద్దాం.


అవార్డ్స్‌ స్కాలర్‌షిప్‌
భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల UG/PG విద్యార్థుల కోసం రూపొందించిన స్కాలర్‌షిప్ ఇది. ట్యూషన్, ప్రయాణ, జీవన వ్యయాలను ఇది కవర్ చేస్తుంది. అర్హత పొందాలంటే.. అర్హత కలిగిన దేశ పౌరసత్వం, తగిన విద్యార్హతలు ఉండాలి.

గవర్నమెంట్ రీసెర్చ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్
ఇది ఆస్ట్రేలియాలో పరిశోధన చేయాలనుకునే PG విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్. ఇది ట్యూషన్, ప్రయాణ, జీవన వ్యయాలను కవర్ చేస్తుంది. అర్హత పొందాలంటే.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.


డెస్టినేషన్ స్కాలర్‌షిప్
ప్రాంతీయ ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల స్కాలర్‌షిప్ ఇది. ట్యూషన్, ప్రయాణ, జీవన వ్యయాలను ఇది కవర్ చేస్తుంది. దీనికి అర్హత పొందాలంటే.. అర్హత కలిగిన దేశ పౌరసత్వం, తగిన విద్యార్హతలు ఉండాలి.

చార్లెస్ డార్విన్ యూనివర్శిటీ స్కాలర్‌షిప్
చార్లెస్ డార్విన్ యూనివర్శిటీలో చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల స్కాలర్‌షిప్ ఇది. ట్యూషన్, ప్రయాణ, జీవన వ్యయాలను ఇదికవర్ చేస్తుంది. అర్హత పొందాలంటే.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.

మెల్బోర్న్ రీసెర్చ్ స్కాలర్‌షిప్
ఈ స్కాలర్‌షిప్ మెల్బోర్న్ యూనివర్శిటీలో పరిశోధన చేయాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల కోసం. ఇది కూడా ట్యూషన్, ప్రయాణ, జీవన వ్యయాలను కవర్ చేస్తుంది. అర్హత పొందాలంటే.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.

గమనిక: పైన పేర్కొన్న స్కాలర్‌షిప్స్‌‌కు సంబంధించిన విద్యార్హతలు కొన్ని సందర్భాల్లో మారవచ్చు. కాబట్టి వాటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అప్లయ్ చేసుకోవడం ఉత్తమం.

Related News

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Terroist Masood Azhar: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Big Stories

×