BigTV English
Advertisement

Silk Smitha: శ్రీహరి భార్యతో చెప్పిన సిల్క్ స్మిత మాటలివే.. అసలేమన్నదంటే..?

Silk Smitha: శ్రీహరి భార్యతో చెప్పిన సిల్క్ స్మిత మాటలివే.. అసలేమన్నదంటే..?

Silk Smitha.. ఒకానొక సమయంలో సౌత్ ఇండియాను తన ఆటపాటలతో, నటనతో షేక్ చేసిన సిల్క్ స్మిత (Silk Smitha) గురించి, ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆమె కొరికన ఆపిల్ అప్పట్లోనే రూ.30 వేలకు పైగా ధర పలికింది అంటే ఆమె రేంజ్ ఏ పాటితో ఇట్టే అర్థమవుతుంది. ముఖ్యంగా ఒక స్టార్ హీరోయిన్ ను మించిన క్రేజ్ ను ఒక నర్తకి దక్కించుకోవడం అంటే అదే తొలిసారి.. చివరిసారి కూడా.. ఆ తర్వాత సిల్క్ స్మిత రేంజ్ లో ఇప్పటివరకు ఏ ఒక్క నర్తకి కూడా పాపులారిటీ దక్కించుకోలేదు అనడంలో సందేహం లేదు. నేడు ఆమె మన మధ్య లేకపోయినా ఇప్పటికే ఆమె క్రేజ్ అలాగే కొనసాగుతోంది. అంతేకాదు సిల్క్ స్మిత బ్రాండ్ ఇమేజ్ ను ఉపయోగించుకొని క్యాష్ చేసుకుంటున్న వారు కూడా చాలామంది ఉన్నారు.


సిల్క్ స్మిత పై ఊహించని కామెంట్స్ వేసిన డిస్కో శాంతి..

ఇకపోతే ఇలాంటి సిల్క్ స్మిత గురించి తెలియని ఎన్నో విషయాలు తాజాగా దివంగత నటుడు శ్రీహరి (Srihari) భార్య, ప్రముఖ నర్తకి డిస్కో శాంతి (Disco Shanti) ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. డిస్కో శాంతి మాట్లాడుతూ .. సిల్క్ స్మితను నేను అక్క అని పిలిచేదాన్ని. ఆమె చాలా మంచిది. అందరితో కలగోలుపుగా మాట్లాడుతుంది. అలాంటి ఆమె సడన్ గా ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఇప్పటికీ మాకు అర్థం కాలేదు.. ఆ సమయంలో నేను ముంబైలో ఉన్నాను ఆ విషయం విని ఆశ్చర్యపోయాను. ఎప్పుడు కూడా అక్క తన భర్త గురించి , తన భర్తకు అంతకుముందే పిల్లలు ఉన్న విషయం గురించి నాతో చెబుతూ ఉండేది.


నోట్ల కట్టలపై నిద్రించేది..

ముఖ్యంగా ఆమెకు సంబంధించిన ఏ విషయం కూడా నాతో దాచిపెట్టలేదు. అప్పట్లోనే ఆమె లక్షల్లో పారితోషకం తీసుకుంది. ముఖ్యంగా రోజుకు 3 లక్షల రూపాయలు తీసుకున్న రేంజ్ ఆవిడది. మేము ఆ స్థాయికి చేరుకోవడానికి పది సంవత్సరాలు పడితే.. ఆమె కేవలం కొన్ని నెలల్లోనే ఆ రేంజ్ దక్కించుకుంది.. ముఖ్యంగా సిల్క్ స్మిత నెలకు 5 లక్షల రూపాయల అద్దె చెల్లించి మరీ ఇంట్లో ఉండేది.ఇంత అద్దె చెల్లించే బదులు సొంత ఇల్లు తీసుకోవచ్చు కదా అని నేను అడిగితే ఆమె చిన్నగా నవ్వేది ..ఒకరకంగా చెప్పాలి అంటే ఆమెది చాలా విలాసవంతమైన జీవితం.. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును మంచంపై పాన్పులా పరుచుకొని పడుకునేది. డబ్బుంటే ఆమెకు అంత ఇష్టం కూడా.. ముఖ్యంగా నేను వేషాల కోసం తిరిగినప్పుడు ఎవరు అవకాశం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నేనే డబ్బుల పైన పడుకుంటున్నాను అని చెప్పింది. అంతేకాదు సెట్లో అందరూ చాలా గౌరవంగా చూసేవారు కూడా..

ఆ బాధ వర్ణనాతీతం..

అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడం ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ కంటతడి పెట్టుకుంది డిస్కో శాంతి. ఎంతో సంతోషంగా ఉండే ఆమె ఆత్మహత్య చేసుకునే అంత బాధ ఎందుకొచ్చిందో..? ఆ విషయంలో ఆమె ఎంత నరకం అనుభవించిందో ..? అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటో..? ఇప్పటికీ తెలియలేదు అంటూ తెలిపింది. ముఖ్యంగా ఆమె ఎంతో మందికి సహాయ సహకారాలు కూడా అందించింది. అలాంటి ఆమె నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమని ఇండస్ట్రీ ఒక మంచి నర్తకిని కోల్పోయిందంటూ తెలిపింది డిస్కో శాంతి. ఇక డిస్కో శాంతి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×