BigTV English

Fighter jets Escort Air India: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. సింగపూర్ ఎయిర్ పోర్ట్ లో హై టెన్షన్

Fighter jets Escort Air India: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. సింగపూర్ ఎయిర్ పోర్ట్ లో హై టెన్షన్

Fighter jets Escort Air India| విమానం గాల్లో ఉండగా.. బాంబు పేలుడు జరుగుతుందని ఒక బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దీంతో విమానం ల్యాండింగ్ సమయంలో భద్రత కోసం మిలిటీర జెట్ ఫైటర్ విమానాలు ప్యాసింజర్ విమానాన్ని జనవాసాలకు దూరంగా సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లాయి. ఈ ఘటన ఎయిర్ విమానానికి సింగపూర్ దేశంలో జరిగింది.


మంగళవారం రాత్రి మధురై నగరం నుంచి సింగపూర్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం AXB 684 లో బాంబు ఉందని ఒక బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. అప్పటికే విమానం సింగపూర్ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో ఉంది. ఈ సమాచారం సింగపూర్ ప్రభుత్వానికి చేరడంతో అక్కడి ప్రభుత్వం తమ రక్షణ బలగాలకు రంగంలోకి దింపింది. సింగపూర్ ఫైటర్ జెట్ విమానాలతో గాల్లో ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని చుట్టముట్టి సింగపూర్ లోని చాంగి ఎయిర్ పోర్ట్ లోని నిర్మానుష ప్రాంతంలో దింపాయి.

విమానం ల్యాండ్ కాగానే ఎయిర్ పోర్ట్ లోని గ్రౌండ్ బేస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, బాంబు నిర్వీర్యం చేసే ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్‌పోజల్ టీమ్స్ చేరుకున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని ఎయిర్ పోర్ట్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.


Also Read:  బేరుట్‌లో కూలిపోయిన ఇళ్లు.. బాంబుల భయంతో రోడ్లపై నిద్రిస్తున్న వేలాది ప్రజలు..

ఈ విషయం గురించి సింగపూర్ రక్షణ శాఖ మంత్రి ఎన్‌జి ఎంగ్ హెన్ ట్విట్టర్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. రాత్రి దాదాపు 10 గంటలకు తమకు విమానంలో బాంబు ఉందని సమాచారం అందిందని.. అయితే తమ ఫైటర్ జెట్స్ సురక్షితంగా విమానాన్ని చాంగి ఎయిర్ పోర్ట్ లోని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లారని ఆయన ట్వీట్ లో తెలిపారు.

విమానంలో బాంబుని నిర్వీర్యం చేసేందకు రక్షణ బృందాలు చర్యలు చేపట్టారని వెల్లడించారు. విమానం ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు తన పోస్ట్ లో తెలియాజేశారు. మరోవైపు ఎయిర్ ఇండియా తరపు నుంచి విమానంలో ఎంత మంది ప్రయాణీకులు ఉన్నారో సమాచారం అందలేదు. బాంబు బెదరింపుల గురించి ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు.

మంగళవారం ట్విట్టర్ ఎక్స్ లో ఒక పోస్ట్ ప్రకారం.. మొత్తం ఏడు ఇండియన్ విమానాలలో బాంబు ఉంది. ఈ క్రమంలోనే న్యూ ఢిల్లీ నుంచి చికాగో వెళుతున్న విమానాన్ని కెనడాలోని ఇకాలుయిత్ ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ముంబై నుంచి న్యూ యార్క్ బయలుదేరిన విమానం కూడా బాంబు బెదిరింపు కారణంగా న్యూ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది.

చికాగో, న్యూ యార్క్ లాంటి అమెరికా నగరాలకు వెళ్లే విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో మంగళవారం అమెరికా ప్రభుత్వం దీనిపై స్పందించింది. ”కమర్షియల్ ఏవియేషన్ (ప్యాసింజర్ విమానాలు)కు ఎటువంటి బెదిరింపులు వచ్చినా బాధ్యులపై కఠినంగా చర్యలు చేపడతాం. సంబంధిత విచారణ ఏజెన్సీలు ఈ సమస్యపై వెంటనే స్పందించాలి. బెదిరింపులు నిజం అయినా కాకపోయినా.. విమాన సంస్థలు వీటని సీరియస్ గా తీసుకోవాలి.” అని అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియా సమావేశంలో అన్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×