BigTV English

Simbaa Pre Release Event: మొక్కలు నాటితే టికెట్స్ ఫ్రీ.. ‘సింబా’ మూవీ బంఫర్ ఆఫర్!

Simbaa Pre Release Event: మొక్కలు నాటితే టికెట్స్ ఫ్రీ.. ‘సింబా’ మూవీ బంఫర్ ఆఫర్!

Simbaa Pre Release Event Director Emotional: టాలీవుడ్ బ్యూటీ అనసూయ, జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘సింబా’. ఈ సినిమాను సంపత్ నంది టీం వర్క్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు సంపత్ నంది కథ అందించగా.. మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. వృక్షో రక్షతి రక్షిత: కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది.


తాజాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్యే విజయ రామణారావు, నటుడు భానుచందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్‌లో స్టేజీపై డైరెక్టర్ మురళీ మనోహర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన టీం అందించిన సహకారాన్ని గుర్తు చేసుకొని కంటతడి పెట్టాడు.

అంతకుముందు లండన్ వెళ్లిన మురళీ.. షార్ట్ ఫిల్మ్ స్కూల్‌లో కోర్సులు చేసి రెండేళ్ల తర్వాత ఇండియా తిరిగొచ్చాడు. ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ.. డైరెక్టర్ సంపత్ నంది నిర్మాణ సంస్థలో అదనపు బాధ్యతుల చూసుకున్నాడు. తాజాగా, సింబా మొదటి సినిమా కావడంతో స్టేజీపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.


నటీనటులు అనసూయ, జగపతిబాబు మాట్లాడారు. పర్యావరణం కాన్సెఫ్ట్‌తో సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తుందన్నారు. ఇది డాక్యుమెంటరీ కాదని, వృక్షంతో కనెక్ట్ చేసి తీసిన మూవీ అని జగ్గుభాయ్ అన్నారు. ఆ తర్వాత నటుడు శ్రీనాథ్ మాట్లాడాడు. ఎవరైనా మొక్కలు నాటి మెసెజ్ చేస్తే..టికెట్లు ఫ్రీగా పంపిస్తానని ఆఫర్ ప్రకటించాడు.

Also Read: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ మరోసారి వాయిదా పడనుందా?

ఈ వ్యాఖ్యలకు రాజ్యసభ్యుడు సంతోష్ కుమార్ స్పందించాడు. శ్రీనాథ్ మాత్రమే కాదు..నేను కూడా ఫ్రీగా టికెట్లు ఇస్తానన్నాడు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని కోరాడు. అయితే త్వరలోనే ఈ మొక్కలు నాటి టికెట్స్ ఎలా పొందాలనే విషయంపై మూవీ యూనిట్ క్లారిటీ ఇవ్వనుంది. ఇక, ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 9న విడుదల చేయనున్నారు. ఇందులో కస్తూరీ, దివీ, శ్రీనాథ్, కబీర్ సింగ్, పలువురు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×