BigTV English

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ మరోసారి వాయిదా పడనుందా?

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ మరోసారి వాయిదా పడనుందా?

Ram Charan’s Game Changer Release Date(Telugu film news):గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్, పాపులర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఇందులో బాలీవుడ్ క్వీన్ కియారా అద్వానీ నటిస్తుండగా.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


ఈ మూవీకి సంబంధించి ఇటీవల నిర్మాత అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్‌లో రిలీజ్ కానుందని తెలిపారు. అయితే ఈ సినిమాపై తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా మరోసారి వాయిదా వేశారని, వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నట్లు ఓ వార్త సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది.

అయితే, ఈ వార్తపై మేకర్స్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే ఏప్రిల్ 10న ‘రాజాసాబ్’, మార్చి 28న విజయ దేవరకొండ ‘వీడీ12‘ డేట్స్ లాక్ చేసుకున్నాయి. ఒకవేళ ఇదే సీజన్‌లో ‘గేమ్ ఛేంజర్’ విడుదల అయితే పోటీ ఆసక్తికరంగా ఉండనుందని పలువురు సినిమా ప్రముఖులు చెబుతున్నారు.


ఇదిలా ఉండగా, ఈ సినిమా రిలీజ్‌పై గందరగోళం నెలకొంది. గత రెండేళ్లుగా ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ ఉండడంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తాజాగా, మరోసారి ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉండడంతో అభిమానులు చిరాకుగా ఉన్నారు.

Also Read: ఆ‘నందమూరి’స్తున్న అక్కచెల్లెళ్లు..జాన్వీ, కుషీకపూర్

ఇక ,ఈ సినిమాను దిల్ రాజ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ లెవల్‌లో పొలిటికల్ థ్రిల్లర్స్‌గా వస్తున్న ఈ మూవీలో ఎస్ జె సూర్య, అంజలి, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×